Moviesకృష్ణ - ఏఎన్నార్ మ‌ధ్య ప‌గ పెంచేసిన సినిమా ఇదే.. అస‌లేం...

కృష్ణ – ఏఎన్నార్ మ‌ధ్య ప‌గ పెంచేసిన సినిమా ఇదే.. అస‌లేం జ‌రిగిందంటే…!

టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య వృత్తి పరంగా ఎత్తులు.. పైఎత్తులతో కూడిన యుద్ధాలు నడుస్తూ ఉంటాయి. ఇది ఈ తరంలో మాత్రమే కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ వస్తోంది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు ఎన్టీఆర్‌కు మధ్య సినిమాల పరంగాను.. రాజకీయపరంగాను తీవ్రమైన పోటీ ఉండేది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కృష్ణకు ఎన్టీఆర్తో మాత్రమే కాదు.. మరో స్టార్ హీరో ఏఎన్నార్ తోను గొడవలు జరిగిన మాట వాస్తవం.

ఇందుకు ఒక సినిమా కారణం అయ్యింది. అదే దేవదాసు. తెలుగులో దేవదాసు పేరు ప్రస్తావించగానే ముందుగా ఏఎన్ఆర్ నటించిన దేవదాసు సినిమా గుర్తుకొస్తుంది. ఆ పాత్రకు ఆయన జీవం పోశారు. అయితే మరోసారి దేవదాసు సినిమాలో నటించాలన్న కోరికతో కృష్ణ పెద్ద సాహసం చేశారు. కృష్ణ – విజయనిర్మల కాంబినేషన్లో మళ్లీ దేవదాసు సినిమా తెరకెక్కింది.

విచిత్రం ఏంటంటే కృష్ణ దేవదాసు సినిమా రిలీజ్ అయిన రోజు ఏఎన్ఆర్ తన పాత దేవదాసు సినిమాను రెండోసారి రిలీజ్ చేశారు. కృష్ణ దేవదాసు సినిమా అట్టర్ ప్లాప్ అయితే.. ఏఎన్ఆర్ దేవదాసు సినిమా రెండో రిలీజ్ లోను వంద రోజులకు పైగా ఆడింది. చాలా కేంద్రాలలో ఏఎన్ఆర్ దేవదాసు సెకండ్ రిలీజ్ లో వంద రోజులు ఆడటం అప్పట్లో ఓ సెన్సేషన్.

అసలు దేవదాసు అంటే తెలుగు ప్రేక్షకులు ఏఎన్ఆర్ ను మాత్రమే ఊహించుకున్నారు. కృష్ణ దేవదాసును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన ఆర్థికంగా కూడా నష్టపోయారు. ఇటు ప‌రువు కూడా పోయింది. కావాలని ఏఎన్ఆర్ తనకు నష్టం కలిగించడానికి ఆయన దేవదాసును మళ్ళీ రిలీజ్ చేశారని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు అలా దేవదాసు సినిమా ఏఎన్ఆర్ – కృష్ణ మధ్య కొన్ని సంవత్సరాలపాటు మాటలు లేకుండా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news