Moviesమ‌హేష్ భార్య న‌మ్ర‌త అన్ని కోట్ల క‌ట్నం తెచ్చిందా... అందుకే...

మ‌హేష్ భార్య న‌మ్ర‌త అన్ని కోట్ల క‌ట్నం తెచ్చిందా… అందుకే మ‌హేష్ అంత ధ‌న‌వంతుడా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – న‌మ్ర‌తా శిరోద్క‌ర్ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అసలు చాలామంది దంపతులు నమ్రత – మహేష్ బాబులా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని కోరుకునేలా వీరు కలిసిమెలిసి ఉంటారు. 2000 సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వయసులో మహేష్ కంటే నమ్రత పెద్ద. అయినా వీరి ప్రేమకు వయసు అంతరం అడ్డు రాలేదు. ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2005లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.

ఇక మహేష్ జీవితంలోకి నమ్రత ఎంటర్ అయ్యాక మనోడు లైఫ్‌ పూర్తిగా మారిపోయింది. మహేష్ సినిమా వ్యక్తిగత, వ్యాపార విషయాలలో నమ్రత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. నమ్రత తన భర్త కెరీర్ కోసం ఎంతో ? ఎఫెక్ట్ పెడుతున్నారు. చివరకు మహేష్ సినిమాల కథల ఎంపికతో పాటు దర్శకులను ఎంపిక చేసుకోవడం, సినిమాల‌ మార్కెట్ స్టాటజీ అన్నింట్లోనూ నమ్రత జోక్యం ఉంటుందన్నది వాస్తవం. అయితే అది మహేష్ కెరీర్‌ పెరుగుదలకు చాలా హెల్ప్ అయ్యింది.

ఇంకా చెప్పాలంటే నమ్రత మహేష్ కెరీర్ లోకి ఎంటర్ అయ్యాకే మనోడు ఆస్తిపాస్తుల విలువలు కూడా బాగా పెరిగాయి. ఇటు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. అటు వ్యాపారాలు కలిసి వచ్చాయి. దీంతో మహేష్ ఆస్తులు బాగా పెరిగాయి. అటు నమ్రతవైపు నుంచి కూడా మహేష్ కు చాలా ఆస్తులు కలిసి వచ్చాయి. మామూలుగానే నమ్రతది మంచి సంపన్న కుటుంబం.

న‌మ్ర‌త‌ చిన్న వయసులోనే మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. అలాగే ఆమె మిస్ ఇండియా కిరీటం కూడా గెలుచుకుంది. ఎన్నో వ్యాపార ప్రకటనలను ప్రమోట్ చేసింది. అప్పట్లోనే ఆమెకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ వచ్చి పడేది. అలాగే ముంబై రియల్ ఎస్టేట్లోనూ ఆమె పెట్టుబడును పెట్టింది. ఇప్పుడు ఆ ఆస్తులు విలువ కోట్లలోనే ఉంటుంది. ఆమె హైదరాబాదులో పలు వ్యాపారాలు ప్రారంభించారు. ఇప్పటికే ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మించి థియేటర్ వ్యాపారం లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు హైదరాబాదులోనే మరో మల్టీప్లెక్స్ కూడా కట్టే ప్లానింగ్ జరుగుతోంది. ఇక రెస్టారెంట్ వ్యాపారం లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగుళూరు రియల్ ఎస్టేట్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా ఓవరాల్ గా చూస్తే మహేష్.. నమ్రత ఆస్తులు విలువ కోట్లలోనే ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో కొన్ని తరాల నుంచి స్థిరాస్తులు కూడ‌ పెట్టుకున్న హీరోలకు పోటీగా మహేష్ ఆస్తుల విలువ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా నమ్రత మహేష్ కు చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news