అక్కినేని నాగేశ్వరరావు.. కుటుంబ కథా సినిమాలకు కేరాఫ్ అన్న విషయం తెలిసిందే. అనేక సినిమాల్లో నటించి.. సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. అయితే.. రెండు విషయాల్లో మాత్రం అక్కినేని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకటి .. పౌరాణిక సినిమాలకు కడుదూరంగా ఉండడం. రెండు రాజకీయాలకు ఆమడ దూరంగా ఉండడం. ఈ రెండు విషయాలు కూడా అక్కినేనిని చాలా ఇబ్బందికి గురి చేశాయని అంటారు.
ఆయనను పౌరాణిక సినిమాల్లో నటించమని.. రోజూ ఎంతో మంది నిర్మాతలు కోరేవారట. అంతేకాదు.. ఎన్టీఆర్ ననటిస్తున్నారు కదా.. మీరు కూడా నటించాలని.. అడ్వాన్సులు కూడా ఇచ్చి వెళ్లేవారట. కానీ, అక్కినేని మాత్రం పౌరాణిక సినిమాలకు ససేమిరా అనేవారు. దీనికి కారణం.. తర్వాత తర్వాత.. ఆయన చెప్పుకొచ్చారు. భూకైలాస్ సినిమాలో నారదుడిగా నటించాను. కానీ, ఏమైంది?
అని అన్నారు.
అవకాశం ఉందని.. అన్నీ నేను నటించినా.. ప్రేక్షకులుగా మీరిచ్చే తీర్పునకు నేను లోబడి ఉండాలి. నాకుసాంఘిక సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ పౌరాణిక సినిమాలకు లేదు.. సో.. వదులుకోవడం తప్పులే దు
అని అక్కినేని చెప్పారు. ఇక, రాజకీయాల గురించి.. మాట్లాడుతూ.. నేను ఒకరితో అనిపించుకోను.. అనను. ఏదో ప్రశాంతంగా నా పనిచేసుకుని పోతున్నాను.. మీరు ఉన్నారుగా చాలు! అని ముక్తసరిగా వ్యాఖ్యానించేవారు.
రాజకీయాలంటే.. అక్కినేనికి అసలు పడేది కాదు. సినిమా రంగంలోనూ ఆయన రాజకీయాలను ఇష్టపడేవారు కాదు. ఎవరైనా.. పొలిటికల్ వ్యూ.. క్యూ అంటూ.. ఏదైనా కామెంట్ చేస్తే.. నీ వేషాలు నాదగ్గర వద్దు! అని కఠినంగా చెప్పేవారట. ఇలా.. అక్కినేని జీవితంలో ఈ రెండు విషయాలు అత్యంత తీవ్రంగా బాధ పెట్టాయని అంటారు. ఒకానొక దశలో ఎన్టీఆర్‌తోనూ రాజకీయాల విషయంలో విభేదించడం గమనార్హం.