ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో నాగ్ అశ్విన్ తాను వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ తో రు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఇప్పుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై జాతీయస్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మహానటి లాంటి సావిత్రి బయోపిక్ తర్వాత ఈ సినిమా కోసం ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికైనా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర టెక్నికల్ పనులు పూర్తిచేసుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రాజెక్టు కే అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రాజెక్టు కే రెండు భాగాలుగా వస్తుందని ఇప్పటివరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన లీకులు చూస్తుంటే నాగ్ అశ్విన్ దెబ్బతో టాలీవుడ్ మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. ఇది రెండు భాగాల సిరీస్ కాదు అని.. ఇదో సీరిస్‌గా వస్తుందంటున్నారు.
పురాణాల్లో ఉన్న కొందరు చిరంజీవుల చరిత్రను బేస్ చేసుకుని.. ఆ మంచి పాత్రల ఆధారంగా ఓ ఫాంటసీ కథలను అల్లుకుంటూ వెళుతున్నాడట నాగ్ అశ్విన్. కర్ణ, కృష్ణ, కృపాచార్యుడు ఇలాంటి పాత్రలను వర్తమానంలోకి తీసుకువచ్చే ఫాంటసీ కథల నేపథ్యంలో ఈ సీరిస్ సినిమాలు వస్తాయట. ప్రాజెక్ట్ అంటే కర్ణ, కృష్ణ అంటున్నారు.
ఇప్పుడు తీసే సినిమాలో బ్రహ్మగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం. ఏదేమైనా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె తో యావత్ నేషనల్ వైడ్ సినిమా ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపునకు తిప్పుకున్నాడు అన్నది నిజం. రాజమౌళి అయినా జానపద కథల నుంచి స్ఫూర్తిగా పొందుతున్నాడు.. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకుంటున్నాడు. అయితే నాగ్ అశ్విన్‌లో ఇందుకు భిన్నంగా మంచి కథకుడు ఉండడంతో పాటు దానిని చక్కగా విజువలైజేషన్ చేసుకుంటున్నాడు.