Moviesసౌంద‌ర్య చ‌నిపోయిన వెంట‌నే చ‌నిపోదామ‌నుకున్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు..?

సౌంద‌ర్య చ‌నిపోయిన వెంట‌నే చ‌నిపోదామ‌నుకున్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు..?

టాలీవుడ్ లో మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ దివంగత టాప్ హీరోయిన్ సౌందర్య. సౌందర్య కన్నడ అమ్మాయి అయినా.. ఆమెను తెలుగు ప్రజలు తమ తెలుగింటి ఆడపడుచుగా చూసుకున్నారు. సౌందర్యం 16 అణాల అచ్చ తెలుగు ఆడపిల్ల అని పిలిచేవారు. తెలుగు ప్రేక్షకులు సౌందర్యను తమ ఇంటి ఆడపడుచుగా.. తమ అక్కగా, చెల్లిగా చూసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 15 సంవత్సరాల పాటు తెలుగుతోపాటు, సౌత్ సినిమా ఇండస్ట్రీని తన సినిమాలతో ఆమె ఒక ఊపు ఊపేశారు.

ఎంతమంది హీరోయిన్లు వచ్చిన ఏమాత్రం పరిధి దాటకుండా సాంప్రదాయ బద్ధమైన వస్త్రధారణతో నటించి సూపర్ హిట్లు కొట్టిన ఘనత సౌందర్యకు మాత్రమే దక్కుతుంది. అప్పట్లో స్టార్ హీరోలు సైతం సౌందర్య తమ సినిమాలలో ఉండాలని పట్టు పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలకు గుడ్ బై చెప్పాక తన సొంత మేనబావను పెళ్లి చేసుకున్న ఆమె బెంగుళూరులో సెటిల్ అయింది.

ఆ తర్వాత బిజెపిలో జాయిన్ అయిన‌ సౌందర్య 2004 ఎన్నికల ప్రచారం కోసం అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో కరీంనగర్‌కు వస్తున్న క్ర‌మంలో జ‌రిగిన ప్ర‌మాదంలో తన సోదరుడితో కలిసి దుర్మరణం పాలయ్యారు. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉన్నారు కూడా..! సౌందర్య చనిపోయిన వెంటనే యావత్ తెలుగు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమెతో పని చేసిన ఎంతోమంది హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలు కంట‌తడి పెట్టుకున్నారు.

ఇక సౌందర్యతో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు అయితే క్షణికావేశంలో సౌందర్య లేని జీవితం మాకు మాత్రం ఎందుకు ? మేము కూడా చనిపోదాం అని అనుకున్నారు అట. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు జగపతిబాబు, విక్టరీ వెంకటేష్ కావటం విశేషం.
ఈ ఇద్దరు హీరోలు అంటే సౌందర్యకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా సౌందర్య హైదరాబాదులో ఎన్ని రోజులు ఉన్నా.. జగపతిబాబు ఆమెకు కావలసిన సకల సౌకర్యాలు సమకూర్చి పెట్టేవారట.

జగపతిబాబు తరపట్ల తీసుకునే కేరింగ్ తోనే ఆమె జగపతిబాబుని ఎంతో ఇష్టపడేవారని ఇండస్ట్రీ జనాలు చెప్పేవారు. జగపతిబాబు ఎన్నో సందర్భాలలో సౌందర్య చనిపోయిందన్న వార్త తెలిసిన వెంటనే తాను కూడా చనిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. ఇక వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. సౌందర్య మరణ వార్త తెలిసిన వెంటనే వెంకటేష్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఎందుకు ? ఈ జీవితం అని ఎంతో ఆవేదనకు గురయ్యారట. ఆమె మరణం నుంచి కోలుకునేందుకు ఈ ఇద్దరు హీరోలకు చాలా రోజులు పట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news