అగ్రదర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. ఆయన చేతిలో పడితే.. ఏ హీరోకైనా.. ఏ హీరోయిన్‌కైనా దశ తిరిగినట్టే అనే టాక్ ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం గమనార్హం. నిజానికి రాఘవేంద్రరావు.. తండ్రి కేఎస్ ప్రకాశరావు కూడా దర్శకులే. దసరాబుల్లోడు వంటి అక్కినేని నాగేశ్వరరావుతో సూపర్ డూపర్ హిట్ అందించిన అగ్రదర్శకుడు. ఇక, రాఘవేంద్రరావు కుమారుడు.. కూడా.. పెద్ద దర్శకుడే. ఈ విషయం చాలా మందికి తెలియదు.
రాగ
అని ఒక సినిమాను తీసి.. సూపర్ హిట్ కొట్టారు. హాలీవుడ్లో ఇప్పటికీ.. సినిమాలు తీసుకున్నారు. అయితే.. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు దర్శకులు వచ్చిన ఏకైక చరిత్రనుసొంతం చేసుకున్న రాఘవేం ద్రరావు కుటుంబంలో తన తండ్రి, తన కుమారుడికి రాని ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. అదే.. రాఘవేంద్రరావు చేతిలో పడితే దశ తిరిగినట్టే అనే టాక్. ముఖ్యంగా ఈ పేరు హీరోలకన్నా. హీరోయిన్లకు ఎక్కువగా వచ్చింది.
భిన్నమైన శైలిలో ఆలోచించే రాఘవేంద్రరావు.. అనేక హిట్ సినిమాలు అందించారు. అయితే.. 1980లలో ఆయన తీసిన సినిమాలు చూస్తే.. అప్పటి వరకు ఉన్న ట్రెండును ఒక్కసారిగా మలుపు తిప్పారు. అప్పటి వరకు హీరోయిన్ నాభిభాగాన్ని చూపించే సీన్ల వరకు పరిమితం అయితే.. రాఘవేంద్రరావు.. మరో స్టెప్ ముందుకు వేశారు. నాభి భాగంపై పండ్లు వేసే సీన్లు తీసుకువచ్చారు. ఆ సీన్లు యువతను థియేటర్ బాట పట్టించాయి.
దీంతో అలాంటి సీన్ లేకుండా.. సినిమాలు రాలేదంటే.. ఆశ్చర్యం లేకపోలేదు. అంతేకాదు.. హీరోయిన్గా రాఘవేంద్రరావు సినిమాలో బుక్ అయిందంటే.. ఆమె అన్నింటికీ రెడీ అయిపోవాల్సిందే.. అనే టాక్ కూడా వినిపించేది. అయితే.. కొందరు శోభన, భానుప్రియ, రాధ వంటి వారు ఇలాంటి సీన్లను ఇష్టపడలేదు. దీంతో విజయశాంతి (జానకిరాముడు), రమ్యకృష్ణ వంటివారితో అప్పట్లో సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఇదీ.. సంగతి..!