భానుమతి అలనాటి మేటినటి. ఆ తరం హీరోయిన్లలో చాలా ధైర్యవంతురాలు. పెళ్లయ్యాక కూడా ఆమె ఎన్నో సినిమాలలో ఎందరో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ లాంటి హీరోలకు ఆమె బామ్మగా నటించి మెప్పించారు. భానుమతి అంటే అప్పట్లో ఓ సెన్సేషన్.. ఓ డేరింగ్ నటి. అసలు ఆమెతో నటించే సమయంలో ఎంత పెద్ద హీరో అయినా అతి చేస్తే ఆమె వెంటనే వార్నింగ్ ఇచ్చేవారట.
ముఖ్యంగా ఆమె హీరోలకు పోటీగా ఉండేవారు.. హీరోలతో పోటీపడి మరి నటించేవారు. హీరోలతో పోలిస్తే మనం ఎందులో తక్కువ ? అని వారితో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని పట్టుబట్టేవారు. అసలు ఏ విషయంలోనూ ఆమె వెనక్కు తగ్గే వారే కాదు. దర్శకులు కూడా భానుమతి సెట్లో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఆమెకు సీన్లు వివరించే క్రమంలో.. ఆమెతో నటన రాబట్టుకునే విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండేవారు.
అయితే అలాంటి భానుమతిని ఎన్టీఆర్ వేధించాడు అంటూ ఒక పుకారు బయలుదేరింది. ఇదంతా ఎన్టీఆర్ సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వచ్చాక బయలుదేరిన పుకారు కావడం విశేషం. మరి నిజంగానే భానుమతి పేరు చెప్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా జాగ్రత్తగా ఉంటారు.. అలాంటి భానుమతిని నిజంగా ఎన్టీఆర్ వేధించారు అంటే అవన్నీ అబద్ధాలు మాత్రమే.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కరరావు ఈ పుకారును పుట్టించారని అప్పట్లో గుసగుసలు అయితే ఉన్నాయి. పైగా నాదెండ్ల భానుమతి తనతో ఎన్టీఆర్ గురించి అవి ఇవి చెప్పారు అని చెప్పడమే తప్పా… భానుమతి మాత్రం ఎన్టీఆర్ తనను ఇబ్బంది పెట్టారని ఎప్పుడూ చెప్పలేదు.