Moviesరాజమౌళి ఐడియాను దొబ్బేసిన సుకుమార్..పుష్ప 2 దెబ్బకు బాక్స్ ఆఫిస్ ...

రాజమౌళి ఐడియాను దొబ్బేసిన సుకుమార్..పుష్ప 2 దెబ్బకు బాక్స్ ఆఫిస్ షేక్ అవ్వాల్సిందేగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో పుష్ప 2 టీజర్ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఒకే ఒక్క డైలాగ్ ” పుష్ప పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే”..ఈ డైలాగ్ చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు . అంతలా సుకుమార్ ఈ డైలాగ్ తో ఇండస్ట్రీని షేక్ చేసేసాడు . మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు పుష్ప2 సినిమా బ్యాన్ చేయాలి అనేంత రేంజ్ కి భయపడ్డారు ..అంటే బన్నీ లెవెల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఎదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు .

ఈ క్రమంలోనే పుష్ప2 సినిమాకి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించడం ఒక సమస్య అయితే ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడం మరో సమస్య . ఈ విషయంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు రాజమౌళి . సినిమాని ఎంత పద్ధతిగా తెరకెక్కిస్తాడో.. అంతే పద్ధతిగా ప్రమోషన్స్ చేసి క్లియర్ కట్ గా తన వాదనను వినిపించేస్తాడు .

కాగా ఈసారి పుష్ప2 సినిమాకి సుకుమార్ అలాగే చేయబోతున్నాడట . రాజమౌళి ఐడియాను దొబ్బేసి సినిమా రిలీజ్ కి నాలుగు నెలల ముందు నుంచే పక్క ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లిపోవాలి అంటూ ప్లాన్ చేస్తున్నారట . పుష్ప వన్ కి పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయలేకపోయారు . కానీ పుష్ప 2 విషయంలో మాత్రం ప్రతి ఈవెంట్ కి ప్రతి భాషల్లోను ప్రమోట్ చేసే విధంగా బన్నీతో మాట్లాడుతున్నారట . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం పుష్ప2 రికార్డులు మోత మోగాల్సిందే అని .. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు . ఏ మాటకు ఆ మాట ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టాలంటే పుష్ప 2 రావాల్సిందే అంటున్నారు బన్ని అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news