సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న హీరోయిన్ లలో నయనతార ముందు వరుసులో ఉంటుంది. ఈ అమ్మడు దాదాపు పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ గా ఆఫర్ లను అందుకుంటోంది. అంతేకాకుండా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తోంది. కాస్త ఏజ్ పెరగటం వల్ల సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ ఓవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొడుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం షారుక్ ఖాన్ కు జోడీగా బాలీవుడ్ లోనూ సినిమా చేస్తోంది.
ఈ సినిమాలో అమ్మడు బికినీ వేసుకుంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నయనతార సినిమా లైఫ్ ను వేలెత్తి చూపించలేం కానీ అమ్మడి రియల్ లైఫ్ మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ముఖ్యంగా నయనతార ఎఫైర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. కెరీర్ ప్రారంభంలోనే నయనతార తమిళ హీరోయిన్ అమ్మాయిల కలల రాకుమారుడు శింబుతో లవ్ ఎఫైర్ నటించింది. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఏం జరిగిందో కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తరవాత కూడా నయనతార సైలెంట్ గా కూర్చోలేదు. ప్రముక కొరియోగ్రాఫర్ ప్రభుదేవతో ప్రేమాయణం నడిపించింది.ఇక అప్పటికే ప్రభుదేవకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ అతడితో పెళ్లికి సిద్దం అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. నయన్ ప్రభదేవతో పెళ్లి కోసం సినిమాలకు కూడా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. శ్రీరామరాజ్యం సినిమా లాస్ట్ డే షూట్ లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కానీ చివరికి ఏం జరిగిందో కానీ నయన్ ప్రభుదేవ బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇక చివరికి నయన్ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకోవడంతో పాటూ ఇద్దరు కవలలను సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే నయనతారకు తమిళనాడు ఎమ్మెల్యే మరియు హీరో ఉదయనిధి స్టాలిన్ తో కూడా ఎఫైర్ నడిపించింది అని సీనియర్ నటుడు బిజెపి నేత ధారారవి వెల్లడించారు.
నయనతారకు డీఎంకేకు ఉన్న సంబంధమేంటని ధారారవి ప్రశ్నించాడు. నయనతారతో మంత్రి ఉదయనిధి కి ఎఫైర్ ఉందని… ఈ విషయం మాట్లాడినందుకే తనను డిఎంకె పార్టీ నుండి బహిష్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నయనతార ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అలాంటివి తాను పట్టించు కోవడం లేదని చెప్పారు.