Moviesనాగార్జున కంటే ముందే అమల ఆ హీరోను ప్రేమించిందా..? పెళ్లినీ పెటాకులు...

నాగార్జున కంటే ముందే అమల ఆ హీరోను ప్రేమించిందా..? పెళ్లినీ పెటాకులు చేసింది ఆయనేనా..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు ఏకైక కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నాగచైతన్య పుట్టాక మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి.. తన తోటి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల కుమారుడే అఖిల్ .అమల బెంగాలీ తల్లికి, ఐరిస్ తండ్రికి పుట్టిన అమ్మాయి.

ఆమె మోడలింగ్ నుంచి సౌత్ ఇండియాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళంలో చాలామంది స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, కమలహాసన్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో అమల ఎన్నో సినిమాలలో హీరోయిన్గా చేసి సూపర్ హిట్ లు కొట్టింది. నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో అమల నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అయితే నాగార్జున ప్లే బాయ్‌ మనస్తత్వం తెలుసుకున్న‌ అమల వెంటనే పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టలేదు. దీంతో నాగ్‌ అమల మెడలో మూడు ముళ్ళు వేసేశాడు. ఆ తర్వాత కూడా నాగార్జున టబూ తో ప్రేమాయ‌ణం నడిపాడని.. అమల చాలా తెలివిగా కంట్రోల్లో పెట్టుకుందని టాలీవుడ్ లో టాక్ ఉంది. ఇదిలా ఉంటే నాగార్జున కంటే ముందే అమల కోలీవుడ్లో ఒక స్టార్ హీరోను ప్రేమించిందని టాక్. ఆ హీరో కూడా అమ్మాయిల విషయంలో మంచి విలాస పురుషుడే. పేరుకు పెద్ద స్టార్ హీరో..!

ఇప్పటికే రెండు పెళ్లిళ్లు, సహజీవనాలు పెటాకులు అయ్యాయి. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలోనే అమల, అతడి మాయమాటలు నమ్మి ప్రేమలో పడిందని.. ఎప్పుడూ అయితే అతడి మనస్తత్వం పూర్తిగా తెలిసిందో ? అప్పటినుంచి అతడికి దూరం జరిగి తెలుగులో నాగార్జునతో నటిస్తున్న సమయంలో నాగార్జున వలలో పడిపోయిందని అంటారు. ఆ కోలీవుడ్ స్టార్ హీరో చేసిన మోసంతోనే అమల నాగార్జున అయితే తనకు కరెక్ట్ గా సరిపోతాడని భావించి.. నాగార్జునను నమ్మి సర్వస్వం అర్పించి ప్రేమలో పడిందన్నది టాలీవుడ్లో జనాలు చెప్పే మాట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news