సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అజిత్ .. హీరోయిన్ షాలిని పేర్లు చెప్తే అందరికీ అదో తెలియని కొత్త ఫీలింగ్ ఏర్పడుతుంది . అఫ్ కోర్స్ వీళ్ళు కలిసి ఎన్నో సినిమాలు నటించారు . నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కానీ వీళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఎవరు గుర్తించలేకపోయారు . అంత సీక్రెట్ గా వీళ్ళ ప్రేమను కొనసాగించారు ఈ జంట.
అయితే అందరూ అనుకున్నట్టు వీళ్ళ ప్రేమ – పెళ్లి అంతా ఈజి గా ఏమి జరగలేదు. ఎన్నో ట్విస్టులు ఎన్నో గొడవలు మరెన్నో రాద్ధాంతలతో ..ఫైనల్లీ వీళ్ళ పెళ్లి జరిగింది . కాగా ఏప్రిల్ 25 నాటికి వీరు పెళ్లి జరిగి 23 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ క్రమంలోనే హీరోయిన్ షాలిని భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేసుకుంది . తమ పెళ్ళి రోజును గుర్తు చేసుకుంటూ ప్రేమతో 23 సంవత్సరాలు అనే క్యాప్షన్ ని ఇచ్చింది.
అప్పట్లో షాలిని – అజిత్ ఎలా మాట్లాడుకునేవారు అనే సీక్రెట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . అప్పట్లో షాలినితో కలిసి నటించిన కుంచకు ఓబన్ ఓ సందర్భంలో వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు వీరి ప్రేమకు సహకరించే వారట . అప్పట్లో మొబైల్స్ లేకపోవడంతో షూటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్లిద్దరూ మాట్లాడుకోవడానికి సీక్రెట్ కోడ్ సోనా ఏకే 47 కాలింగ్ అనే కోడ్ వార్డ్ ని ఉపయోగించేవారు . ఈ విషయం బయట పడిపోవడంతో సదురు సినిమా డైరెక్టర్ కమల్ కంచుకోను ఇదే విషయం అడిగితే ఆయన అసలు విషయం చెప్పారట .
అంతేకాదు మరుసటి రోజు కమల్ ..షాలిని ని పిలిచి ఏంటి ఏకే 47 ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు అంటూ అడిగేసరికి సిగ్గుపడుతూ షాలిని చిరునవ్వు నవ్విందని.. అప్పుడే వాళ్ళ ప్రేమ విషయం అఫీషియల్ గా బయటపడింది అంటూ చెబుతున్నారు . ఏది ఏమైనా సరే నిజమైన ప్రేమకు అర్థం గా ఈ జంటను కోలీవుడ్ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . ఈ జంట ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో షాలిని-అజిత్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించినా అవంత ఫేక్ అంటూ కొట్టి పడేసారు ఈ జంట. ప్రజెంట్ కోలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ సెలబ్రిటీస్ కపుల్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ జంట..!!