సమంత ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ సినిమా శాకుంతలం. సమంత ఫస్ట్ టైమ్ పురాణాల నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె శకుంతలగా కనిపించబోతోంది. మళయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గుణాటీమ్ వర్క్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై నీలిమా గుణ, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాకు హైదరాబాద్‌లో రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసి కొందరు సినిమా సెలబ్రిటీలకు చూపించారు.
ఈ ప్రీమియర్లను బట్టి చూస్తే శాకుంతలంకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమా అంతా భావోద్వేగాల సమూహారంగా ఉందని… సమంత మాత్రం చాలా బాగా యాక్ట్ చేసిందని.. ఆమె తన పాత్రకోసం ప్రాణం పెట్టి పని చేసిందని… అయితే సినిమా స్లోగా ఉండడం.. ఈ కథతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడం కష్టమనే అంటున్నారు. అటు దేవ్‌మోహన్ నటన కూడా బాగుందని… అల్లు అర్హ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆమె చెప్పే తెలుగు డైలాగ్‌లు ముచ్చటగా ఉంటాయని చెపుతున్నారు.
ఓవరాల్‌గా చాలా మంది అభిప్రాయాలు తీసుకుంటే సినిమాకు నెగటివ్ టాక్ ఉంది. సినిమా చాలా స్లో ఉందనే అంటున్నారు. గుణశేఖర్ భారీ బడ్జెట్ పెట్టానని చెపుతున్నా విజువల్స్ ఆ స్థాయిలో లేవని.. అవతార్ లాంటి సినిమాలు చూసిన వారికి ఈ సినిమా ఏ మాత్రం ఆసక్తిగా ఉండదనే అంటున్నారు. అసలు కొన్ని చోట్ల సినిమా చూస్తున్నామా ? టీవీలో సీరియల్ చూస్తున్నామా ? అన్న ఫీలింగ్ కూడా కలుగుతుందట.
హిందీ సీరియల్స్ టీవీల్లో చూసిన వారికి శాకుంతలం పెద్దగా ఎక్కదని… సినిమా మరీ క్లాసిక్ స్టైల్లో బోర్ కొట్టించేస్తుందట. సినిమాలో చాలా పాత్రలుండటంతో ఎవరికీ సరైన ప్రాధాన్యత దక్కలేదనే అంటున్నారు. చాలా సీన్లు రొటీన్‌గానే ఉన్నాయని.. మైథలాజికల్ మూవీ అయినా రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో సీన్లను తలపించాయంటున్నారు. అసలు విజువల్ వండర్, కళాఖండం అనే స్థాయిలో ఎంత మాత్రం లేదని చెపుతున్నారు.
ఇక ఈ సినిమాకు చాలా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. అయితే నెగటివ్ కారణంతోనే మిగిలిన ప్రీమియర్లు కూడా ఆపేసినట్టు ఇండస్ట్రీ టాక్ ? ఈ సినిమాకి ఎంత చేసినా హైప్ రావడం లేదన్నది వాస్తవం. ఇక సమంత కూడా నటనకు మంచి మార్కులతో సంతృప్తి చెందిన ఈ సినిమా టాక్ చూస్తే ఆమెకు మిగిలేది కన్నీళ్లే అంటున్నారు.