నాగచైతన్యతో విడాకులు తర్వాత ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడని సమంత ఇప్పుడు తాను నటించిన శకుంతలం సినిమా ప్రమోషన్లలో చైతుతో విడాకుల గురించి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో తన విడాకులు, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలు ఆవేదన గురించి కూడా ఓపెన్ అవుతుంది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎఫైర్ గురించి కూడా సమంత తన సన్నిహితులతో మాట్లాడినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.
ఎవరు ఎవరితో ఏ రిలేషన్ షిఫ్‌లో ఉన్నా తనకు బాధ లేదని.. అయితే ప్రేమకు విలువ ఇవ్వనివారు ఎంతమందితో కలిసినా వాళ్లకు కన్నీళ్లే మిగులుతాయని కామెంట్ చేసిందట. కనీసం ఆ అమ్మాయి ( శోభిత ధూళిపాళ్లను ఉద్దేశించి ) అయినా సంతోషంగా ఉండాలని.. తన ప్రవర్తన మార్చుకుని ఆ అమ్మాయి మనసు నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుందని సమంత తన సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తోంది.
సమంత మాటలు చూస్తే డైరెక్ట్‌గా చైతుపై ఎటాక్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. చైతుతో ఉంటే శోభితకు కన్నీళ్లే మిగులుతాయని.. ప్రవర్తన మార్చుకుని ఆమెను అయినా బాగా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఆమె సన్నిహితుల ద్వారానే బయటకు రావడం.. ఇండస్ట్రీ మొత్తం చర్చకి రావడం విశేషం. ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి నాలుగేళ్లు కాపురం చేసిన సమంత 2021 సెప్టెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటినుంచి సమంతకు సంబంధించిన ఏ విషయం అయినా జనాల్లో సంచలనాత్మకంగా మారుతుంది. ఇక సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచే నాగచైతన్య – శోభిత చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.