Moviesబ్లాక్ డ్రెస్‌లో హాట్ అందాలు.. కేక పెట్టిస్తున్న సమంత న్యూ లుక్స్..!

బ్లాక్ డ్రెస్‌లో హాట్ అందాలు.. కేక పెట్టిస్తున్న సమంత న్యూ లుక్స్..!

చెన్నై చిన్నది సమంత మయోసైటీస్ నుంచి కోలుకున్నాక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. సమంత నటించిన శకుంతలం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సమంత ప్రమోషన్లలో ఎంత సింపతి గేమ్ ప్లే చేసినా కూడా కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ప్రస్తుతం ఆమె కేరళలో విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో ఉంది. ఈ క్రమంలోనే సమంత ఇప్పుడు సీటాడెల్‌ కోసం లండన్ వెళ్లిపోయింది.

రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ వెర్షన్‌కు తెలుగు ద్వయం రాజ్ – డీకే దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు కలిసి హాలీవుడ్ సిటాడెల్లో నటించారు. ఇండియన్ వెర్షన్ లో సమంత – వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ లండన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక, రీచ‌ర్డ్‌తో పాటు సమంత – వరుణ్ ధావన్ పాల్గొన్నారు

సమంత బ్లాక్ డ్రెస్‌లో డైమండ్ నెక్లెస్ పెట్టుకొని సరికొత్త స్టైల్ లో దర్శనమిచ్చింది. ఇప్పటివరకు ఈ డ్రెస్ లో ఆమెను మనం చూడలేదు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేయగా.. పలువురు సెలబ్రిటీలు, ఆమె అభిమానులు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వెంకటేష్ కూతురు అశ్రిత సైతం సామ్ లుక్స్ కి స్ట‌న్నింగ్‌ అంటూ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఒక రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news