Moviesఏం చేయలేక ..అక్కడ చేయి అడ్డుపెట్టుకున్న.. సెక్స్ సీన్స్ పై ప్రియాంక...

ఏం చేయలేక ..అక్కడ చేయి అడ్డుపెట్టుకున్న.. సెక్స్ సీన్స్ పై ప్రియాంక బోల్డ్ కామెంట్స్..!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ హీరో రిచ‌ర్డ్‌ మాడెన్ ప్రధాన పాత్రలో కలిసి నటించిన వెబ్ సిరీస్ సీటాడెల్‌. రూస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ స్పై థ్రిల్ల‌ర్ ఈనెల 28 నుంచి ప్రముఖ ఓటిటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో హీరోయిన్ ప్రియాంకను అర్ధ నగ్నంగా చూపించారు. రిచ‌ర్డ్‌తో కలిసి బెడ్ రూమ్ సీన్లు కూడా ఉన్నాయి అంటున్నారు.

ఈ బోల్డ్ సీన్లు షూట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ? హీరో తనకు ఎలా సహకరించారు.. తాను ఎలా సహకరించాను అన్న విషయాన్ని ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. సీటాడెల్‌ వెబ్ సిరీస్లో తాను బోల్డ్ సీన్లలో నటించానని.. అలాంటి సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో ఇద్దరం ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాం.. కొన్ని అసౌకర్యమైన యాంగిల్స్ లో నటించాల్సి వచ్చినప్పుడు.. ఇబ్బందిగానే ఫీలయ్యామ‌ని చెప్పింది.

కెమెరాలో మా బాడీ పార్ట్స్ స్పష్టంగా కనిపించకుండా చేతులతో కప్పి ఉంచుకునే వాళ్ళం. రిచ‌ర్డ్ కూడా ఇక్కడ చేయి పెట్టుకో.. అక్కడ కప్పేసేయ్‌ అని.. తనను గైడ్ చేసినట్టు ప్రియాంక వెల్లడించింది. ఎలాంటి బోల్డ్ సీన్లు షూట్ చేస్తున్నా ఇద్దరు ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా క్లోజ్ గా ఉంటూ… సీన్లు పూర్తి చేశామని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ఇక సీటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శక ద్వ‌యం రాజ్ డీకే ఈ వెబ్‌ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్లో ప్రియాంక పోషించిన పాత్రను ఇండియన్ వెర్షన్ లో సమంత చేస్తోంది. ఇక ప్రియాంక మాదిరిగానే సమంత కూడా అంతే బోల్డ్ గా నటిస్తుందా ? లేదా డోస్ తగ్గించి చూపిస్తారా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news