Movies"ఏం పాపం చేసానో..ఆ ప్రేమకు నోచుకోలేకపోయాను"..కంట తడి పెట్టిస్తున్న సమంత మాటలు(Video)..!!

“ఏం పాపం చేసానో..ఆ ప్రేమకు నోచుకోలేకపోయాను”..కంట తడి పెట్టిస్తున్న సమంత మాటలు(Video)..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో సమంత శకుంతల దేవి పాత్రలో కనిపిస్తూ ఉండడం అభిమానులకి కొత్త ఫీలింగ్ ను కలగజేస్తుంది .

ఇప్పటివరకు హాట్ అండ్ సెక్సీ రోల్స్లోనే కనిపించిన సమంత .. ఫస్ట్ టైం ఇలా పిరియాడికల్ పాత్రలో కనిపిస్తూ ఉండడం.. నిజంగా సినిమాకి కొత్త హైప్ ని తీసుకొచ్చింది . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా శాకుంతలం టీం స్నిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎడిట్ చేశారు . మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది సమంత అందాలు.

చూడడానికి చాలా చక్కగా న్యాచురాలిటీగా.. నిజంగా శకుంతల దేవి ఇలానే ఉంటుందా..? అని ఈ జనరేషన్ పిల్లలకు తెలిసేలా నటించింది . అంతేకాదు ఈ సినిమా ట్రైలర్లో సమంత తన బాధను దుష్యంతుడికి చెప్పే టైం లో ..”ఏ పాపం చేసుకున్నానో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయాను “అంటూ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. ఆ విషయం చిన్న ట్రైలర్ లోనే తెలిసిపోయింది . దీంతో సమంత మాటలకు ఎమోషన్ అవుతున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ..సమంత ఖాతాలో మరో హిట్ పక్కా అంటూ రివ్యూ ఇస్తున్నారు . చూద్దాం మరి ఏప్రిల్ 14న సమంత జాతకం ఎలా తిరగబోతుందో..?

https://twitter.com/Samanthaprabhu2?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news