Movies"ఆ నొప్పి భరిస్తేనే తెలుస్తుంది రా ఫూల్స్".. టైం చూసి రెచ్చకొడుతున్న...

“ఆ నొప్పి భరిస్తేనే తెలుస్తుంది రా ఫూల్స్”.. టైం చూసి రెచ్చకొడుతున్న రేణు దేశాయ్ ..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల వైరం ఇప్పటిది కాదు. విడాకులు అనంతరం రేణు దేశాయ్ చాలాసార్లు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. భార్య ఉండగానే మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని రేణు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. నా సంపాదనతోనే తాను తన పిల్లల బాధ్యత నెరవేరుస్తున్నాను అని ఎన్నోసార్లు చెప్పారు. ఇక పవన్ గౌరవానికి భంగం కలిగేలా రేణు మాట్లాడడంతో.. పవన్ అభిమానుల్లో కొందరు ఇప్పటికీ ఆమెను వదిన అంటూ అభిమానిస్తున్నా…. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

ఇక రేణు దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు చేసిన ప్రకటనతో పవన్ అభిమానులు మరింత రచ్చ చేశారు. రేణు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద గోల చేశారు. రేణుదేశాయ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే తనపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో రేణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారణం ఏమైందో తెలియదు కానీ రేణు రెండో పెళ్లి ఆలోచన విరమించుకున్నారు.

తాజాగా అఖీరానందన్ పవన్ కళ్యాణ్ కుమారుడు అని పవన్ అభిమానులు సంబోధించడంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది. కొందరు నెటిజన్లు మా అన్న కొడుకు అకీరా అంటూ కామెంట్ చేశారు. దీంతో రేణు అకీరా నా కొడుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖీరా నా కొడుకు.. మీ అన్న కొడుకు ఏంటి ? ఒక తల్లికి పుట్టావా సరిగ్గా మాట్లాడటం నేర్చుకో అంటూ రేణు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా మొదలైన ఈ యుద్ధం సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూ వస్తోంది. కొందరు అయితే పవన్ వచ్చే ఎన్నికలలో పోటీకి రెడీ అవుతున్నాడని… పవన్ ఇమేజ్‌ డామేజ్ చేయడానికే రేణు ఇలాంటి కామెంట్లు చేస్తోందని విమర్శలు చేస్తున్నారు. అయితే కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆమెకు స‌ల‌హాలు ఇచ్చారు. ప‌వ‌న్ యాంటీ ఫ్యాన్స్ మీకు రాంగ్ మెసేజ్‌లు పంపుతారు. కామెంట్స్ సెక్ష‌న్ ఆఫ్ చేయ‌మ‌ని సూచించారు.

దీనిని రేణు త‌ప్పుప‌ట్టారు. స‌మాజంతో ఇదే ప్రాబ్ల‌మ్‌. ఎవ‌రి కోస‌మే నేను మారాలా ? మీరు చెప్పిన‌ట్టు జీవించ‌డానికి నేను ఏం త‌ప్పు చేశాను.. స‌ల‌హా ఇవ్వ‌డం చాలా ఈజీ.. ఆ బాధ అనుభ‌వించే వాళ్ల‌కే తెలుసు అని ఆమె కామెంట్ చేసింది. ఏదేమైనా ప‌వ‌న్ ఫ్యాన్స్ విష‌యంలో రేణు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news