Moviesబిగ్ బ్రేకింగ్: యాంకర్ సుమ కనకాల అరెస్ట్..షాక్ లో అభిమానులు ..అసలు...

బిగ్ బ్రేకింగ్: యాంకర్ సుమ కనకాల అరెస్ట్..షాక్ లో అభిమానులు ..అసలు ఏమైందంటే..!?

వాట్ ..యాంకర్ సుమ అరెస్ట్ అయిందా..? ఎందుకు ..? అసలు ఏమైంది..? అంత చెత్త పని యాంకర్ సుమ ఏం చేసింది ..? అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు . మరి ముఖ్యంగా యాంకర్ సుమ అరెస్ట్ కు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తుంది. అయితే యాంకర్ సుమ అరెస్ట్ అయిన మాట వాస్తవమే కానీ.. నిజంగా కాదు .

అది ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్క్రిప్ట్ లో భాగంగానే అని తెలిస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా కస్టడీ . వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం యాంకర్ సుమను బాగా వాడేసుకుంటున్నారు చిత్ర బృందం.

కాగా ఈ క్రమంలోనే యాంకర్ సుమ ఓ జీప్ లో అరెస్ట్ అయిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇదంతా కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసమే అని కొందరు అంటూ ఉంటే .. మరి కొందరు ప్రమోషన్స్ కోసం ఇంతలా ఫన్ క్రియేట్ చేస్తారా ..? నిజంగానే అనుకోని ఆమె అభిమానులకు ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే..? ఏం చేస్తారు..? అంటూ మండిపడుతున్నారు . అయితే ముందు వెనక ఆలోచించుకోకుండా అరెస్ట్ చేసి మరి యాంకరింగ్ చేయిస్తుంది కస్టడీ టీం అంటూ జనాలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఓవర్ క్రియేటివిటీ ఎక్కువైపోతుంది అనేది మాత్రం వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news