నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ..టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం మనకు తెలిసిందే . గీత గోవిందం అనే సినిమాతో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట ఆ సినిమాలో వాళ్ల కెమిస్ట్రీకి .. రొమాన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు . ఈ క్రమంలోనే ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్టే రష్మిక విజయ్ – దేవరకొండ కూడా పలు పార్టీస్ లో దర్శనం ఇవ్వడం ..డిన్నర్ డేట్లకు వెళ్లడం అభిమానులకు కొత్త డౌట్లు పుట్టేలా చేసింది .
కాగా మొన్నటికి మొన్న రష్మిక మందన – విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ లో ఒకే రూమ్లో ఉన్నట్లు కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ ఫిక్స్ అయిపోయారు ఫాన్స్ . సీన్ కట్ చేస్తే రష్మిక – విజయ్ తో బ్రేకప్ చేసుకుంది అన్న వార్తలు వైరల్ అయ్యాయి. దానికి కారణం బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో రష్మిక క్లోజ్ గా మూవ్ అవ్వడమే . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ న్యూస్ వైరల్ అయింది .
కాగా రీసెంట్గా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన నోట్ ఆధారంగా కూడా అదే వార్తలు వైరల్ అవుతున్నాయి . సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం.. సినిమా రిలీజ్ సందర్భంగా సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. ఎంతలా అంటే సమంత తనకు ఎంతో ఇంపార్టెంట్ .. తన జీవితంలో సమంత ఓ ఐరన్ లేడీ అన్న రేంజ్ లో చెప్పుకునేలా భారీ లైనప్ ఇచ్చాడు .
ఈ క్రమంలోనే ఈ పోస్ట్ చూసిన అందరూ సమంత సినిమాకి విజయ్ దేవరకొండ ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏముంది ..? నిజంగానే సమంత – విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ నడుస్తుందా..? ఆ కారణంగానే ఈ విజయ్ ఇలా పోస్ట్ పెట్టాడా ..? అంటూ చెప్పుకుంటుంటే .. మరికొందరు రష్మిక – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుగుతుంది అన్న కోపంతో నే విజయ్ ఇలా పోస్ట్ చేశాడని .. అంతేగాని విజయ్ మనసు అలాంటిది కాదని .. మంచి మనసున్న హీరో అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!