అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్ . సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . సినిమా ముందు వరకు భారీ అంచనాలు నెలకొన్న ఏజెంట్ మూవీ సడన్గా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు షాక్ అయిపోయారు . సినిమా రిలీజ్ అయ్యే కొద్ది గంటల వరకు కూడా ఏజెంట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని .. సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది అంటూ నానా హంగామా చేశారు .
అయితే మొదటి షో పడగానే సినిమా డిజాస్టర్ గా మారిపోయింది . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ పడిపోతున్నారు . కాగా సరిగ్గా ఇలాంటి టైం లోనే ఏజెంట్ సినిమాని కావాలని ఓ ప్రొడ్యూసర్ టార్గెట్ చేసి ఫ్లాప్ చేయించాడు అని ప్రొడ్యూసర్ నట్టి కుమార్ చెప్పుకు రావడం సంచలనంగా మారింది . రీసెంట్గా మీడియా తో మాట్లాడిన నటి కుమార్ మాట్లాడుతూ..” అక్కినేని ఫ్యామిలీని కావాలని తొక్కేసారని.. అక్కినేని అఖిల్ సినిమాకి థియేటర్స్ కేటాయించకుండా ఆయన లైఫ్ ను నాశనం చేశారు అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయం నాగార్జునకు అర్థం కావడం లేదా అంటూ కూడా మండిపడ్డాడు”.
ఈ క్రమంలోని నట్టు కుమార్ మాట్లాడుతూ .. “అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే .. మాలాంటి చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి ” అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కూడా నాగార్జున పై ఫైర్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ఈ రకాలుగా వార్తలు వైరల్ అవుతున్న కానీ నువ్వు సైలెంట్ గా ఉండడం ఏం బాగోలేదు నాగార్జున.. ఏదో ఒకదానికి రెస్పాండ్ అవ్వాలని ..ఇద్దరు కొడుకులు పై ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతూ ఉంటే సైలెంట్ గా ఎలా ఉన్నావు అంటూ నిలదీస్తున్నారు. మరికొందరు దారుణంగా నాగార్జునకి ఇలాంటివి పట్టవా..? కళ్ళు కనబడట్లేదా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం అర్థం అయిపోయింది .. అక్కినేని ఇంటి ఫ్యామిలీ టైం బాగోలేదు అందుకే మంచికపోయినా చెడు ఎదురవుతుంది..!!