Moviesఎన్టీఆర్ సినిమాని దొబ్బేసిన ప్రభాస్.. ఫోన్ చేసి మరి తారక్ క్లాస్...

ఎన్టీఆర్ సినిమాని దొబ్బేసిన ప్రభాస్.. ఫోన్ చేసి మరి తారక్ క్లాస్ పీకాడా..?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా డైరెక్ట్ర్ ఓ కథను రాసుకునేటప్పుడు ఒక హీరోని ఊహించుకుంటారు . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే తమ ఊహల్లో ఊహించుకున్న హీరో తాము రాసుకున్న కథని ఒప్పుకోవాలన్న రూల్ ఎక్కడా లేదు. డైరెక్టర్ రాసుకున్న కథకి ఆ హీరో సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు.. ఆ కథ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు.. ఈ క్రమంలోనే ఎంతో ఇష్టంగా రాసుకున్న కథలు కూడా మరో హీరోకి వెళ్ళిపోతూ ఉంటాయి . అలా వెళ్ళిన సినిమాలు కొన్ని హిట్ పడితే కొన్ని తుస్సుమంటు పోతాయి. అయితే మనం చేయాల్సిన సినిమా పక్క హీరో చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటే ..ఆ బాధ వర్ణాతీతం.

అలాంటి బాధను అనుభవించాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన చేయాల్సిన సినిమాను దొబ్బేసిన ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని కెరియర్లో ముందుకు దూసుకెళ్లిపోయాడు . ఈ విషయం తెలుసుకున్న తారక్ సైతం ప్రభాస్ కు ఫోన్ చేసి ఫన్నీగా నా సినిమాను దొబ్బెసావ్ రా అంటూ ఫైర్ అయ్యారట . ఇదే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రభాస్ హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ .

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు వస్తున్న ట్రెండ్ ని మార్చేస్తూ ఫ్రెష్ ఫీలింగ్ ను కలగజేసింది . నిజానికి ఈ సినిమాలో మొదటి హీరోగా అనుకునింది జూనియర్ ఎన్టీఆర్ ని అట. అయితే ఆ టైంకి జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేక.. సినిమాని హోల్డ్ చేయమన్నారట . అయితే దశరథ్ అంత టైం వెయిట్ చేయలేక ..కథను ప్రభాస్ కి వివరించగా ప్రభాస్ ఓకే చేయడం తెర్కెక్కించడం ..రిలీజ్ చేయడం చక చకా జరిగిపోయాయి . ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూసే జనాలు మనలో ఎంతోమంది ఉన్నారు . అంతలా ప్రభాస్ ఇమేజ్ ని మార్చేసింది ఈ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news