అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. రెండున్నర సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. రు. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్. సురేందర్ రెడ్డి సైరా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ఇదే.
అఖిల్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతానని ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు ఓవర్సీస్ షోలతోనే దిమ్మతిరిగిపోయే ప్లాప్ టాక్ వచ్చేసింది. ఎవరి నోట విన్నా ఏజెంట్ పెద్ద డిజాస్టర్.. అదో మిస్ ఫైర్ బుల్లెట్ అని విమర్శలు చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ కూడా పరమ రాడ్అని.. అసలు కథ, కథనాలు ఎటు నుంచి ఎటు పోయాయో కూడా తెలియదంటున్నారు.
సినిమాకు యునానమస్‌గా డిజాస్టర్ టాక్ వినిపిస్తుంటే అటు హీరో అఖిల్ ఈ రోజు థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని మూసాపేట్ శ్రీరాములు థియేటర్ లో ఉదయం 7 గం. ల షోని ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో కలిసి అఖిల్ చూస్తున్నాడు. అఖిల్‌తో పాటు ఈ షోను ఇంకా ఎవరెవరు చూస్తున్నారు అన్నది తెలియట్లేదు.
ఈ సినిమా కోసం అఖిల్ చాలా బాగా కష్టపడ్డాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో పాటు అటు ఒత్తుగా జుట్టు పెంచుకుని ఇలా కసరత్తులే చేశాడు. అయితే సినిమాకు మాత్రం ఇంత ఘోరమైన టాక్ రావడం బాధాకరమే. ఈ సినిమాతో కెరీర్లోనే తిరుగులేని మంచి హిట్ కొడతానని అఖిల్ ఆశలతో ఉన్నా తొలి షోకే ఇంత నెగటివ్ టాక్‌తో పరువు మొత్తం పోయినట్లయ్యింది.