MoviesNTR30: కొరటాల మరో తలతిక్కల నిర్ణయం.. ఈసారి ఫ్యాన్స్ ఊరుకోరు బ్రదర్..జాగ్రత్త..!!

NTR30: కొరటాల మరో తలతిక్కల నిర్ణయం.. ఈసారి ఫ్యాన్స్ ఊరుకోరు బ్రదర్..జాగ్రత్త..!!

ఏంటో .. ఈ కొరటాల శివ తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ.. తెలిసి తెలియక చేసినతనంతో తీసుకున్న నిర్ణయాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాడు . నిన్న మొన్నటి వరకు సరైన అప్డేట్ లేదు .. షూటింగ్ స్టార్ట్ చేయలేదు అంటూ రచ్చ రంబోలా చేసిన ఫ్యాన్స్ కి ఎట్టకేలకు అప్డేట్స్ ఇస్తూ వచ్చాడు . ఈ క్రమంలోనే ప్రజెంట్ హైదరాబాద్లో ఎన్టీఆర్ 31 షెడ్యూల్ షూట్ జరుగుతుంది అని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ సంబర పడుతున్నారు.

మరికొద్ది రోజుల్లోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే అభిమానులను హర్ట్ చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ తో ఐటెం సాంగ్స్ చేయించిన కొరటాల శివ.. ఈ సినిమాలో కాజల్ తోనే ఐటెం సాంగ్ చేయించాలి అని డిసైడ్ అవుతున్నారట . ఆచార్య చేసిన నష్టాని ఈవిధంగా పూడ్చుకోవాలి అనుకుంటున్నాడు కొరటాల.

అయితే, అప్పుడు కాజల్ వేరు ఇప్పుడు కాజలు వేరు . అప్పుడు కాజల్ కి పెళ్లి కాలేదు .. బిడ్డ లేదు ఇప్పుడు కాజల్ కి పెళ్లి అయ్యింది. బిడ్డ ఉన్నాడు . నీకు బ్రెయిన్ ఉందా..? అంటూ కొరటాల నిర్ణయం పై మండిపడుతున్నారు . అంతేకాదు ఆచార్య సినిమా విషయంలో తీసుకున్న తలతిక్క నిర్ణయాలు ఈసినిమాకి తీసుకుంటే ఊరుకునేది లేదు. ముందు హీరోయిన్ ని మార్చు . బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దించు . సినిమాని మేము హిట్ చేస్తాం అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. మరి కొంత మంది ఫాన్స్ ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news