కోలీవుడ్ సీనియర్ నటి, ప్రస్తుత బిజెపి నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ సుందర్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. బాలనాటిగా కెరీర్ ప్రారంభించిన కుష్బూ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో కుష్బూకు ఇక్కడ మంచి పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత నాగార్జునతో ఓ సినిమాతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలలో నటించారు.
ఆ తర్వాత కుష్బూ మాతృభాష తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తమిళనాడులో ఆమెకు గుడి కట్టి పూజలు చేశారంటే.. ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం కుష్బూ ఇటు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ.. అటు సినిమాలలో సహాయక పాత్రలు పోషిస్తూ మరోవైపు రాజకీయాల్లోనూ దూకుడుగా వెళుతున్నారు. ఇక కుష్బూ వ్యక్తిగత జీవితం గురించి చాలా రూమర్లు ఉన్నాయి. కుష్బూ 2000 సంవత్సరంలో నటుడు, నిర్మాత, దర్శకుడు సి సుందర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే కుష్బూకు అంతకుముందే ఒక పెళ్లి జరిగింది. మన తెలుగు హీరో బాలకృష్ణతోను ఆమెకు ఎఫైర్ నడిచింది అన్న గుసగుసలు ఉన్నాయి. ఒకానొక దశలో బాలకృష్ణ కూడా ఆమెను పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఆగ మేఘాల మీద బాలయ్యకు వసుంధరతో పెళ్లి చేసేసారని అంటూ ఉంటారు. అయితే కుష్బూకు సుందర్ మొదటి భర్త కాదు. 1991 లో వచ్చిన చిన్న తంబి ( తెలుగులో చంటి ) సినిమా షూటింగ్ సమయంలో ప్రభు, కుష్బూ ప్రేమలో పడ్డారు.
నాలుగేళ్లు సహజీవనం చేశాక వీరిద్దరూ 1993లో చెన్నైలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ప్రభును ప్రాణంగా ప్రేమించి నాలుగేళ్లపాటు అతనితో కలిసిమెలిసి ఉన్న కుష్బూ పెళ్లి అయిన 4 నెలలకే అతనితో విడిపోయింది. అప్పటికే ప్రభుకు ఒక పెళ్లి అయింది.. ప్రభు మొదటి భార్య పునీత, ప్రభు తండ్రి శివాజీ గణేషన్ తో పాటు కుటుంబ సభ్యులు కుష్బూతో అతడి వివాహాన్ని అంగీకరించలేదు.
ఈ క్రమంలోనే ఎన్నో గొడవలు జరిగాయి. కుష్బూకు బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ఆమె ప్రభుతో తెగతెంపులు చేసుకొని అతనికి దూరమైంది. ఆ తర్వాత మానసికంగా ఎంతో కృంగిపోయిన కుష్బూ ఫైనల్ గా సిసుందరితో ప్రేమలో పడి అతడిని పెళ్లాడింది.