టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో మారుమ్రోపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా పాపులారిటి సంపాదించుకున్న తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో తన క్రేజ్ ను డబల్ చేసుకున్నారు . ఇప్పుడు బాలీవుడ్ – హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు అందరూ తారక్ తో సినిమా చేయడానికి కుతూహల పడుతున్నారు.
తారక్ తో మేము సినిమా చేస్తామంటే మేము సినిమా చేస్తామంటూ పోటీపడి మరి కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయన కాల్ షీట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తారక్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు . అంతేకాదు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా కధా కంటెంట్ విషయాల పైన దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు బడా ఆఫర్స్ ను రిజెక్ట్ చేశాడు.
బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ ఆఫర్లను రిజెక్ట్ చేసి కోట్లను లాస్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ తారక్ ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడు , ఈ లెక్కన చూసుకుంటే ఈ రెండు సినిమాలను మిస్ చేసుకుని 200 కోట్లు నష్టపోయినట్టే . కానీ తారక్ మాత్రం తన సినిమాల విషయంలో పకడ్బందీగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది . రెమ్యూనరేషన్ గురించి కాకుండా సినిమా కధా కంటెంట్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఇలా కొనసాగితే గ్లోబల్ స్దాయిలో కూడా తారక్ నెం 1 స్దానంలో దూసుకుపోవడం పక్క అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!