సౌత్ ఇండియన్ యాక్టర్, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రుడు. ఈ నెల 14న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఈ సినిమాను తెలుగులో లారెన్స్ సన్నిహితుడు ఠాగూర్ మధు
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ మీద విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే లారెన్స్ ప్రమోషన్లలో పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంటున్నాడు.
తనకు అమ్మ అంటే ఇష్టం అన్న విషయం మీ అందరికి తెలుసు.. రుద్రుడు సినిమాలో అమ్మ, నాన్నల గురించి మంచి సందేశం ఉంది.. ఇందులో కావాల్సినంత కామెడీ, యాక్షన్, ఫన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమా రుద్రుడు అని.. అమ్మను ఇష్టపడే వాళ్లంతా రుద్రుడు సినిమా ఇష్టపడతారని లారెన్స్ చెప్పాడు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ హిట్ అఖండ సినిమా గురించి కూడా లారెన్స్ ప్రస్తావించాడు. అఖండ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఈ సినిమాలో ఫైట్ల కోసమే అఖండ సినిమాను తాను మూడుసార్లు చూశానని లారెన్స్ చెప్పాడు. సినిమాలో ఫైట్లు చాలా బాగున్నాయని… ఆ ఫైట్ మాస్టరే తనకు కావాలని చెప్పానని.. శివ మాస్టర్ ఈ కథకు తగ్గట్టు యాక్షన్ ని అద్భుతంగా డిజైన్ చేశారని.. ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్ ఉంటుందని లారెన్స్ చెప్పాడు.
ఇక త్వరలోనే తాను చంద్రముఖి 2, జిగర్తండా 2 సినిమాలు చేస్తున్నాను… అలాగే లోకేష్ కనకరాజ్ కథ స్క్రీన్ ప్లే తో ఆయన కో డైరెక్టర్ దర్శకత్వంలో… లోకేష్ కనకరాజ్ నిర్మాతగా త్వరలోనే ఓ సినిమా కూడా ఉంటుందని లారెన్స్ చెప్పాడు.