1980వ దశలో సుహాసిని ఒక గొప్ప హీరోయిన్. లోకనాయకుడు కమలహాసన్ అన్న చారు హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన సుహాసిని తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ముందుగా తమిళంలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన సుహాసినికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ శోభన్ బాబు లాంటి హీరోలతో ఎక్కువ సినిమాలలో నటించిన ఆమె ఆ తర్వాత జనరేషన్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన కూడా రొమాన్స్ చేసింది. చిరంజీవి – సుహాసిని. బాలకృష్ణ – సుహాసిని కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక శోభన్ బాబు – సుహాసిని కాంబినేషన్ అంటే సూపర్ హిట్.
కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఆమె తమిళ దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్నారు. మణిరత్నంతో పెళ్లయ్యాక కూడా సుహాసిని కొన్ని సినిమాల్లో నటించింది. అయితే విజయశాంతి అంత గొప్ప స్టార్ హీరోయిన్ కావాల్సిన సుహాసిని మణిరత్నంను పెళ్లి చేసుకోవడంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ పడిపోయిందన్న చర్చలు ఉన్నాయి. నిజంగా ఆ టైంలో ఆమె పెళ్లి కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకుని ఉంటే.. టాలీవుడ్ లో మరికొన్నేళ్ళపాటు తిరిగిలేని స్టార్ హీరోయిన్ అయ్యేదని చాలామంది సినిమా వాళ్ళు చెవులు కొరుక్కున్నారు.
మణిరత్నం మంచి వ్యక్తి అయినా వయసులో సుహాసిని తో పోలిస్తే చాలా పెద్దవాడు. దీంతో ఇద్దరు మధ్య కొన్ని విషయాలలో బేధాభిప్రాయాలు ఉండేవని కూడా అంటారు. ఇక సుహాసిని లాంటి స్టార్ హీరోయిన్ తనకు భార్య అయినా కూడా మణిరత్నం ఆమెను తన కెరీర్ కు వాడుకున్నాడే తప్ప.. ఆమెను పెళ్లయ్యాక ప్రమోట్ చేయాలన్న ఆలోచన చేయలేదు. దీంతో ఆమె వంటింటికే పరిమితం అయిపోయింది. నిజంగా మణిరత్నం ఆమెను ఎంకరేజ్ చేసి ఉంటే తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మరిన్ని మంచి సినిమాలు ఆమెకు దక్కి ఉండేవని అంటారు.
కనీసం బయట ఫంక్షన్లలో కూడా సుహాసిని గొప్పతనం గురించి మణిరత్నం చిన్న మాట కూడా మాట్లాడడు అని.. మణిరత్నం తన భర్త అంటూ సుహాసిని చాలా గొప్పగా ప్రమోట్ చేసుకుంటుంది అని వారిద్దరి గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా మణిరత్నంను ఓ స్టార్ డైరెక్టర్ అని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకున్న సుహాసిని కెరీర్ ఆ తర్వాత ఒంటింటి కుందేలులా పరిమితం అయిపోయింది.