ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరుపాక్ష సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ పాజిటివ్ టాక్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ రికార్డ్స్ నెలకొల్పింది. మరీ ముఖ్యంగా ఫస్ట్ డే ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే ఇది రికార్డ్ అని చెప్పాలి .
కాగా ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ – రాజీవ్ కనకాల – సునీల్ – అజయ్ తదితరులు కీలకపాత్రలో పోషించి సినిమాకి మరింత హైప్ ని క్రియేట్ చేశారు . మరి ముఖ్యంగా ఈ చిత్రానికి కధను సుకుమార్ అందించడం సినిమాకే హైలైట్ గా మారింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఈ సినిమాని తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేసి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. కాగా నిజానికి ఈ సినిమాను సుకుమార్ రాసుకున్నప్పుడు మొదట అనుకున్నా హీరో టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నిఖిల్ .
ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథలో హీరోగా నిఖిల్ అయితే బాగుంటాడు అంటూ సుకుమార్ అనుకున్నారట . అయితే ఈ కథను వివరించగా నిఖిల్ ఈ కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు కార్తికేయ వన్ , కార్తికేయ 2 ఇంచుమించు కథలు ఇలానే ఉంటాయి .. మళ్లీ అదే జోనర్ లొ కథలు తీస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న కారణంతోనే నిఖిల్ కథ నచ్చిన ఈ సినిమా రిజెక్ట్ చేశాడట .
అంతేకాదు ఆ తర్వాత సుకుమార్ నే స్వయంగా ఈ పేరును సజిస్ట్ చేయడం సినిమాకి హైలెట్ గా మారింది . బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చి రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇది కావడం ఆయన కెరీర్ కే హైలెట్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాని నిఖిల్ చేసుంటే ఆయన కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లు నమోదు చేసుకునిఉండేటివి. మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు నిఖిల్ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. కాగా తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు 4.79 కోట్ల షేర్ చేసిన విరూపాక్ష రెండో రోజు ఏకంగా 6.80 కోట్లు నమోదు చేసింది..!!