ప్రభుత్వం నుంచి నటీనటులకు ప్రశంసలు మామూలే అనుకుంటున్నారా? కానేకాదు. ఎప్పుడో ఒక్కసారి అవార్డులు ఇచ్చే సమయంలో తప్ప.. ప్రభుత్వాలు సినిమాల గురించి పెద్దగా పట్టించుకోవు. అవార్డులు ఇచ్చి.. కూడా చేతులు దులుపుకొన్న ప్రభుత్వాలు అనేకం ఉన్నాయి. అయితే.. ప్రభుత్వాలకు పన్నులు చెల్లించే విషయంలో గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించేది.
ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా కడుతున్న.. సమయానికి కడుతున్న వారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. ఎంజీఆర్ ప్రభుత్వం నుంచి జయసర్కారు వరకు కూడా ప్రకటనలు ఇచ్చేవారు. సీఎం సంతకంతో ప్రశంసా పత్రాలు కూడా అందేవి. ఇలా.. అందుకున్న వారిలో చాలా మంది తమిళనాడుకు చెందిన నటీ నటులు ఉన్నారు. తెలుగు వారి విషయానికి వస్తే.. సూర్యాకాంతం ఠంచనుగా ఈ విషయంలో ముందుండే వారు.
పన్నులు చెల్లించకుండానే ఆమె ప్రశంసలు అందుకునేవారట. చిత్రంగా ఉన్నా నిజం. విజయవాడకు చెందిన బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్లే.. ఎక్కువగా తమిళనాడు, ఏపీ నటీనటులకు ఆడిటింగ్ చేసేవారు. ఇలా.. సూర్యాకాంతం లెక్కలు కూడా వీరే చూసేవారు. సూర్యాకాంతం భర్త.. న్యాయమూర్తి కావడంతో ఆయనకు ఎక్కడా చెడ్డ పేరు రావడానికి వీల్లేదని.. సూర్యాకాంతం.. దానాలు ధర్మాలు చేసేవారు.
ఆ లెక్కలన్నీ కూడా బ్రహ్మయ్య అండ్ కోనే చూసేది. అయితే.. అప్పటికే ఏడాది పొడవునా సూర్యకాంతం .. దానాలు ధర్మాలు చేసిన నేపథ్యంలో ఆ లెక్కలన్నీ తీసి ప్రభుత్వానికి సమర్పించేసరికి.. ఆమె రూపాయి కూడా పన్ను చెల్లించాల్సి వచ్చేదికాదట. అయినా. .కూడా సూర్యాకాంతం మాత్రం ముఖ్యమంత్రి సేవా నిధి కి నిధులు ఇచ్చేవారట. దీంతో ఆమె విషయంలో ప్రభుత్వాలు ప్రసంశించేవట.