బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ల బ్రేకప్ లు.. సహజీవనాలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా అంటే అప్పట్లో యువతకు ఒక శృంగార దేవత. రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన బాబీ సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యారు. అప్పట్లో అందాల దేవతగా ఉన్న డింపుల్‌కు చాలామంది హీరోలతో ఎఫైర్ వార్తలు వచ్చాయి.
చివరకు సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో ఆమెకు వివాహం జరిగింది. అయితే 65 ఏళ్ల స్టార్ హీరోయిన్ పై ఇప్పుడు డేటింగ్ వార్తలు రావటం అందరికీ షాకింగ్ గా ఉంది. 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ ఆ తర్వాత 1973లో రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. కొన్నేళ్లపాటు వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే 1984లో సాగర్ సినిమాలో ఆమె నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె మళ్ళీ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఆ సినిమా హిట్ అయ్యాక డింపుల్ వరుసగా సన్నీ డియోల్‌తో చాలా సినిమాల్లో నటించింది. సన్నీ డియోల్, డింపుల్ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వీరిద్దరి విషయాన్ని సన్నీ డియోల్ మాజీ లవర్ అమృతా సింగ్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. విచిత్రం ఏంటంటే సన్నీ – డింపుల్ అఫైర్‌కు రాజేష్ ఖాన్నా ఆమె పిల్లలు ట్వింకిల్, రింకీ కూడా సపోర్ట్ చేశారు.
అప్పటికే ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకున్న సన్నీడియోల్ డింపుల్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కొన్ని బాలీవుడ్ పార్టీలు.. ఈవెంట్లలో డింపుల్‌ను తన భార్యగా పరిచయం చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే సన్నీ – డింపుల్ ఈ వయసులో ఇప్పటికీ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారట.
వీరిద్దరూ ముంబైలోని జుహీ ప్రాంతంలో ఉన్న ఒక ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారని.. వారిద్దరూ కలిసి ఉండేందుకు ఈ ప్లాట్ కొనుగోలు చేశారంటూ ఉమైర్ సంధు అనే క్రిటిక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వాళ్ళిద్దరి ఎఫైర్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇక ఉమెర్ గత కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.