News' శాకుంతలం ' ఫైన‌ల్ క‌లెక్ష‌న్లు... స‌మంత‌ గుణ‌శేఖ‌ర్‌ను ఎన్ని కోట్ల‌కు...

‘ శాకుంతలం ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్లు… స‌మంత‌ గుణ‌శేఖ‌ర్‌ను ఎన్ని కోట్ల‌కు ముంచేసిందంటే..!

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కొందరు నమ్మారు. ఈ సినిమా ప్రమోషన్లలో యూనిట్ కూడా బాగానే హడావుడి చేసింది. యశోద సినిమా రిలీజ్ టైంలో కన్నీళ్లు పెట్టుకొని సింపతి ఆట ఆడి సక్సెస్ అయ్యింది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా విషయంలోనూ అదే సింపతి గేమ్ మరోసారి ప్లే చేసింది.

తన వ్యక్తిగత విడాకుల విషయాలు కూడా ప్రమోషన్లలో చెప్పి సినిమాపై హైప్‌ పెంచేందుకు సాయి శక్తులా ట్రై చేసింది. సినిమా రిలీజ్‌కు 3 – 4 రోజుల ముందే ప్రీమియర్ షోలు కూడా వేశారు. అప్పుడే సినిమాకు పెద్ద నెగిటివ్ దాక వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత రివ్యూలు కూడా ఏమాత్రం గొప్పగా లేవు. సినిమా అట్టర్ ప్లాప్ అన్నారు.. శాకుంత‌లం క‌థ నేటితరం జనాలకు ఏమాత్రం కనెక్ట్ కాలేదు.

దీంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాకు ఘోరమైన నష్టాలు తప్పేలా లేవు. సినిమా ఇప్పటికే చాలా థియేటర్లలో ఎత్తేశారు. పైగా ఈ వారం సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో శాకుంతలం ఫైనల్ బాక్సాఫీస్ రన్ కూడా ముగిసినట్టే. ఈ సినిమాకు తొలి రోజే రు. కోటి షేర్ రాగా.. ఐదో రోజు కేవ‌లం రు. 12 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింది. ఐదు రోజుల‌కు కేవ‌లం 2.30 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 8 కోట్ల గ్రాస్‌.. రు. 4 కోట్ల షేర్ వ‌చ్చింది. రు. 20 కోట్ల పై చిలుకు బాక్సాఫీస్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 18 కోట్ల రేంజ్‌లో న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఏదేమైనా స‌మంత క్రేజ్‌ను వాడుకుని మ‌రోసారి గ‌ట్టెక్కాద్దామ‌నుకున్న గుణ‌శేఖ‌ర్ ఈ సినిమా దెబ్బ‌తో నిండా మునిగిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news