బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్ మూవీల వరకు కూడా ఎన్నో సినిమాల్లో పేరు తెచ్చుకుంది శ్రీదేవి. తర్వాత కాలంలో ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ కూడా అయింది. అయితే.. బాల తారగా నటించిన శ్రీదేవి.. తర్వాత.. కాలంలో హీరోయిన్గా అడుగులు వేసేప్పుడు.. తొలి నాళ్లలో పెద్దగా ఇబ్బందులు రాలేదు.. కానీ, ఒక తరం దర్శకులు మారిన తర్వాత మాత్రం ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది.
దీంతో సినిమాల్లో స్కిన్ షో చేయాలనే డిమాండ్లు పెరిగాయి. వెనక్కితిరిగి చూసుకుంటే బలమైన సినిమాల్లో ఎంతో గౌరవమైన పాత్రలు చేసిన తను.. ఇప్పుడు స్కిన్ షో అంటే.. ఇబ్బందే కదా అనుకునే పరిస్థితి శ్రీదేవిని ఇబ్బంది పెట్టింది. అయినా.. కే. రాఘవేంద్ర రావు వంటివారి సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాక.. తప్పలేదు. ఇలా.. శ్రీదేవి.. తొలినాళ్లలో చాలా చాలా భిడియంగానే ఎక్స్‌పోజింగ్‌కు ఛాన్స్ ఉన్న సినిమాలు ఒప్పుకొన్నారు.
దీంతో శ్రీదేవికి సిగ్గెక్కువ అంటూ.. నిర్మాతల నుంచి కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె స్థానంలో వేరే వారికి అవకాశాలు కూడా దక్కాయి. దీనిని గమనించిన రాఘవేంద్రరావు.. సినిమా ట్రెండ్‌కు తగిన విధంగా మారాలి. తప్పులేదు అని బలవంతం పెట్టారు. ఆయన ఇచ్చిన సలహాతో అప్పటి నుంచి తెరమీద రెచ్చిపోయింది శ్రీదేవి. ఇలా.. శ్రీదేవికి సిగ్గెక్కువ అన్నవాళ్లే.. తర్వాత.. ఆమె చుట్టూ తిరిగారు.
అక్కడితోనే కాదు.. ఆమెకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీదేవికి తిరుగులేకుండా పోయింది. వరుస ఛాన్సులు.. తిరుగులేని క్రేజ్‌తో రెమ్యునరేషన్‌ను డబుల్ చేసింది శ్రీదేవి. బాలీవుడ్‌లోనూ అందాలు చూపించే విషయంలో ఆమె గేట్లు ఎత్తేసింది.