ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మిడిల్ రేంజ్ సినిమా తీసి లాభం తెచ్చుకోవటం మరీ కష్టం. సినిమా రిలీజ్ అయ్యాక హిట్ టాక్ వచ్చి వసూళ్లు వస్తేనే లాభాలు వస్తున్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా మాత్రం అరుదైన ఫీట్ సాధించింది. సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రు. 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ సినిమా ఏపీ తెలంగాణ థియేటర్ హక్కులను రు. 22 కోట్లకు అమ్మేరు.
ఈ హక్కులను హోల్‌సేల్‌గా వెస్ట్ గోదావరి ప్రవీణ్ కు అమ్మేశారు. ఇక నాన్ థియేటర్ హక్కుల రూపంలో మరో రు. 28 కోట్ల ఆదాయం వచ్చింది. నాన్ థియేటర్ ఇతర హక్కులు ఉండనే ఉన్నాయి. ఇలా మొత్తం ఖర్చులు పోను ఆరు నుంచి ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు లాభం మిగిలింది. ఈ లాభాన్ని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తో పాటు హీరో సాయిధరమ్ తేజ్, సమర్పకుడు సుకుమార్ పంచుకుంటారు.
హీరో సాయి తేజ ఈ సినిమాను కొంత రెమ్యూనరేషన్ మీద.. కొంత ప్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన చేశారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా డౌన్ అయింది. రిపబ్లిక్ సినిమాకు మంచి టాక్ వచ్చి వసూళ్లు రాలేదు. అందుకే ఈ సినిమా విషయంలో కొంత ఖర్చులకు రెమ్యూనరేషన్, మరికొంత లాభాల్లో భాగస్వామ్యం పద్ధతిలో చేశాడు. విరూపాక్ష ఈనెల 21న రిలీజ్ అవుతుంది.
నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయి. అలాగే ఈ సినిమాను హోల్సేల్ గా కొన్న ప్రవీణ్ కూడా మంచి మార్కెట్ చేసి తన పెట్టుబడి వెనక్కు రాబట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కలెక్షన్లు వస్తే బయిర్లు కూడా ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సాయి తేజ్ సినిమా మార్కెట్‌కు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది.