ఏ రంగంలో అయినా స్టార్లుగా ఉన్నవాళ్లు అణిగిమణిగి ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండటం మంచిది. ఎప్పుడైతే గర్వం తలకు ఎక్కుతుందో ? అప్పట్నుంచి వారి పతనం మొదలవుతుంది. ఇప్పుడు ఈ సూత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కు కరెక్ట్ గా సరిపోతుంది. హీరోయిన్ గా ఆమె కెరీర్ ఎంత ఫాస్ట్‌గా ఊపందుకుందో ? ఇప్పుడు అంతే స్పీడుగా డౌన్ అవుతోంది. అసలు పూజ బ్యాక్ టు బ్యాక్ వరుసహిట్లు ఇచ్చింది.
అతి తక్కువ టైంలోనే ఆమె ఫేడవుట్ స్టేజ్ కు వచ్చేసింది. టాలీవుడ్‌లో నాగచైతన్య ముకుంద సినిమాతో మొదలుపెట్టి బన్నీ దువ్వాడ జగన్నాథం సినిమాతో తారాజువ్వలా దూసుకు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా పూజ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. పూజ అంటే గోల్డెన్ లెగ్ అన్న పేరు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్లాపులు వచ్చాయి.
తాజాగా సల్మాన్ ఖాన్ కిసీకో భాయ్ కిసీకీ జాన్ తో ఈ ప్లాపుల సంఖ్య ఐదుకు చేరుకుంది. నిజం చెప్పాలంటే పూజ హెగ్డేకు బాలీవుడ్ ఎప్పుడు కలిసి రాలేదు. ఆమె కెరీర్ బాలీవుడ్ లోనే స్టార్ట్ అయింది. తొలి సినిమాతోనే పెద్ద ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో జీవాకు జోడిగా మాస్క్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
ఆమెను తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ ను చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి హృతిక్ రోషన్ కి జోడిగా మొహంజోదారో సినిమా చేసింది ఆ సినిమా కూడా డిజాస్టర్. ఇటీవల తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, అటు కోలీవుడ్‌లో బీస్ట్ తన్నేశాయి. అసలు ఆమె సినిమాలో ఉంటే చాలు ప్లాప్. మహేష్-త్రివిక్రమ్ సినిమా హిట్ అవ్వకపోతే ఆమె మూటా ముల్లు సర్దుకుని ముంబై ఫ్టైల్ ఎక్కేయాల్సిందే అన్న సెటైర్లు పడిపోతున్నాయి.
పూజ తల పొగరు కూడా ఆమె కెరీర్ కాస్త డౌన్ అవ్వడానికి కారణమంటున్నారు. రెమ్యునరేషన్లు అడ్డగోలుగా పెంచేయడం… షూటింగ్‌కు టైంకు రాకపోవడం.. హీరోలతో సెట్లో గొడవలు ఇవన్నీ వచ్చేశాయి. ఇవే ఆమెకు రివర్స్ తన్నేశాయి.