Newsస‌చిన్ కంటే 5 ఏళ్లు పెద్దది... అంజ‌లి - స‌చిన్ ప్రేమ‌లో...

స‌చిన్ కంటే 5 ఏళ్లు పెద్దది… అంజ‌లి – స‌చిన్ ప్రేమ‌లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!

భారత జట్టు మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, భార్య అంజలి ప్రేమ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అంజలి సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి. పైగా ఏకైక సంతానం. ఆమె డాక్టర్.. ప్రస్తుతం సచిన వయసు 50 సంవత్సరాలు అయితే.. వయసులో సచిన్ కంటే అంజలి ఐదేళ్లు పెద్ద.
ప్రస్తుతం అంజలి వయసు 55 సంవత్సరాలు. అయితే వీరిద్దరి ప్రేమకు వయసు అడ్డు కాలేదు. 17 ఏళ్ళ వయసులో 1989లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు.

అక్కడ రెండో మ్యాచ్లోనే అర్థ శతకంతో మెరిశాడు. తిరిగి స్వదేశానికి వస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి అంజలిని చూసి ప్రేమలో పడిపోయాడు. తన తల్లిని తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా వ‌చ్చింది.. స‌చిన్‌ను చూసి ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ స్నేహితులు అయ్యారు. అప్పుడే సచిన్ క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. అటు అంజలి మెడిసిన్ చదువుతోంది.

ఇద్దరు కెరీర్‌ నిర్లక్ష్యం చేయలేదు. అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేసేటప్పుడు సచిన్ ఆమెను ఒకరోజు ఇంటికి ఆహ్వానించాడు. ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ‌ విషయం ముందుగా తెలిస్తే బాగోదని భావించి.. ఆమెను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు. అంజలి కూడా అలాగే చేసింది. 1990లో సచిన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సచిన్ తో మాట్లాడాలంటే అంజలి ఫోన్ బిల్స్ కట్టలేకపోయేదట. దీంతో ఆమె లెటర్ రైటింగ్ మొదలుపెట్టింది.

చివరకు తమ ప్రేమా విషయం తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా స‌చిన్ మొహాట‌ పడ్డాడు. చివరికి అంజలిని స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా వారిద్దరిని నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్ లో ఉండగా జరిగింది. 1995 మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా.. 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు.. సారా మోడల్గా, అర్జున్ క్రికెటర్ గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఇక అంజలి విషయానికి వస్తే ఆమె గుజరాతి కుటుంబంలో పుట్టినా ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి ఆనంద్ గుజరాతి పారిశ్రామికవేత్త… తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందిన అమ్మాయి. అంజలి తాతయ్య భూస్వామి.. వాళ్లకు ముంబైలో విలాసవంతమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి. ఇక అంజలి కజిన్లలో చాలామందికి మెక్సిజన్ మూలాలు ఉన్నాయి. అంజలి కుటుంబానికి నెహ్రూ, గాంధీ కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉండేవట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news