నిజంగా అవుతో కాదో తెలియదు … తనకు తానుగా సినీ విశ్లేషకుడిని అని… దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్‌ను అని చెప్పుకుంటోన్న ఉమైర్ సంధు ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. ఉమైర్ చేస్తోన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండేళ్లుగా ఉమైర్ హిట్ అని చెపుతోన్న సినిమాలు అన్నీ ఫట్ అవుతున్నాయి.
ఇక గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటీనటులపై తీవ్రమైన కామెంట్లు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే మంచు విష్ణుతో సూర్యం సినిమాలో నటించిన సెలీనా జెట్లీపై దారుణమైన కామెంట్లు చేశాడు. సెలీనా జాన్‌సీనా సినిమా కోసం ఫర్దీన్‌ఖాన్‌తో పాటు అతడి తండ్రి ఫిరోజ్‌ఖాన్‌తో పక్క పంచుకుందని అనగా.. అందుకు సెలీనా కూడా నీ అంగస్తంభన సమస్యకు డాక్టర్ దగ్గర చూపించుకోవాలని సలహా ఇచ్చింది.
తాజాగా ఈ సారి ఉమైర్ ట్వీట్టర్ ఖాతా నుంచి అమీషా పటేల్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అమీషా పటేల్ తెలుగులో పవన్ బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో నరసింహుడు, మహేస్‌తో నాని సినిమాలు చేసింది. ఇప్పుడు ఉమైర్ చేసిన ట్వీట్లు బాగా సెగలు పుట్టించేస్తున్నాయి.
ఇందులో అమీషా పటేల్ గురించి చేసిన కామెంట్లో అమీషా పటేల్‌కు ఇప్పుడు గోవా, బెహరైన్, శ్రీలంక, ఖతార్ ల్లో ఫుల్ డిమాండ్ మీద ఉందన్నాడు. ఆమె ఇప్పుడు ఇండియాలోనే హయ్యస్ట్ రేటెడ్ ఉమెన్ అని… ఆమె ఒక్క రాత్రికే ఏకంగా రు. 50 లక్షలు ఛార్జ్ చేస్తోందని చెప్పాడు. మరి 50 ఏళ్ల వయస్సుకు చేరువ అవుతున్నా అమీషాకు ఇంకా ఇంత డిమాండ్ ఉందా ? ఉమైర్ ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు ? దీనికి అమీషా నుంచి ఎలాంటి రిటాక్ట్ ఉంటుందో ? చూడాలి.