టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు త్రిపుల్ ఆర్ సినిమాతో నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌ను ఢీకొట్టే మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.
అలాగే ఇప్పుడు మరో విలన్ పాత్ర కోసం మరో యంగ్ హీరోని కొరటాల శివ తీసుకున్నట్టు తెలుస్తోంది. హరీష్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో జాయిన్ అవుతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమాలో నటించాడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే క్రేజ్ వచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో క్రేజ్ వచ్చేందుకు ఇప్పటికే జాన్వీ కపూర్ తో పాటు సైఫ్ ఆలీఖాన్‌ను తీసుకున్నారు.
అటు కోలీవుడ్‌లో క్రేజ్ కోసం హరీష్ కళ్యాణ్‌ను తీసుకున్నారు. హరీష్‌ది విలన్ పాత్రగా తెలుస్తోంది. అటు కన్నడంలో క్రేజ్ కోసం కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక కీలక నటుడును ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కొరటాల శివ ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సంచలనం నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యువసుధా బ్యానర్ పై కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.