Moviesవారెవ్వ: టైగర్ టైం ఆగయా... బాలీవుడ్ లో సెకండ్ ప్రాజెక్టుకు సైన్...

వారెవ్వ: టైగర్ టైం ఆగయా… బాలీవుడ్ లో సెకండ్ ప్రాజెక్టుకు సైన్ చేసిన తారక్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

వావ్.. ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పట్టించే న్యూస్ అనే చెప్పాలి, ఇన్నాళ్లు తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు యాష్ ఫిలిం సంస్థ క్రేజీ గుడ్ న్యూస్ అందించింది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ఓ రేంజ్ లో మారు మోగిపోతుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరో షారుఖ్ కి సరి సమానంగా రోల్ చేస్తున్న తారక్ ఏకంగా 100 కోట్లు అందుకుంటూ ఉండటంతో బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు .

ఎన్టీఆర్ స్టామినాను తక్కువగా అంచినా వేశామంటూ పొరపాటు పడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే మరో బాలీవుడ్ ఆఫర్ ని సైతం తారక అందుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న “ది ఎమోరల్డ్ అశ్వధామా” సినిమా లో కూడా తారక్ నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రన్వీర్ సింగ్ ఓ పాత్రను చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ప్రజెంట్ మేకర్స్ ఈ పాత్ర కోసం రన్వీర్ సింగ్ ను పక్కనపెట్టి ఎన్టీఆర్ ను అనుకుంటున్నారట .

ఇప్పటికే ఎన్టీఆర్ ను అప్రోచ్ అయి కథ వివరించగా తారక్ సైతం పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియా మరోసారి ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తుంది. అంతేకాదు బాలీవుడ్ హీరోలు కూడా తారక్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ నిజంగా ఇలాగే జరిగితే మాత్రం రానున్న రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా తారక్ మారడం పక్క అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ క్రమంలోనే రణవీర్ లాంటి స్టార్ హీరోని మేకర్స్ పక్కన పెట్టి తారక్ ని అప్రోచ్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news