Moviesఎన్టీఆర్‌కు గురి పెట్టిన స్టార్ న‌టుడి కూతురు.... పెద్ద ప్లానే వేసిందిగా...!

ఎన్టీఆర్‌కు గురి పెట్టిన స్టార్ న‌టుడి కూతురు…. పెద్ద ప్లానే వేసిందిగా…!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వరసలు మాత్రమే కాదు వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేక‌ర్‌ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన స‌యి మంజ్రేక‌ర్ ఇప్పుడు ఇప్పుడే హీరోయిన్గా బిజీ అవుతుంది. బాలనట్టుగా పరిచయం అయిన అమ్మడు ఇప్పుడు హీరోయిన్‌గా దూసుకుపోతోంది. దబాంగ్ 3 సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన స‌యి తెలుగులో వరుణ్ తేజ్ సరసన గని – అడివి శేషుకు జోడిగా మేజర్ సినిమాలలో రొమాన్స్ చేసింది. మేజర్ సినిమా అమ్మడికి మంచి పేరు తీసుకువచ్చింది.

నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో మేజర్ సినిమాతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో రొమాన్స్ చేస్తోంది. రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమె కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంది. తాను చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగినా… తన తండ్రితో స్నేహంగా ఉంటానని.. తాను సినిమాల్లోకి వస్తానని చెబితే తన తండ్రి కాదనకుండా ప్రోత్సహించారని స‌యి తెలిపింది.

ఇక తన సినిమాల విషయంలో తన తండ్రి ఎప్పుడు తల దూర్చ‌ర‌ని.. అయితే సినిమా జీవితాన్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని జర్నీ చేయాలని సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పింది. రామ్‌తో షూటింగ్ చాలా సరదాగా ఉంటుందని.. రామ్ నిజంగానే ఎనర్జిటిక్ స్టార్ అని సన్నివేశాల షూటింగ్లో చాలా కోపరేట్ చేస్తూ ఉంటారని తెలిపింది. ఇక తనకు తెలుగు హీరోలు అందరితోనూ పని చేయాలని ఉందని చెప్పిన స‌యి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పింది.

అలాగే రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలతో కూడా త్వరలోనే నటిస్తాను అని.. ఈ హీరోలతో నటించే అవకాశం వస్తే ఎంత బిజీగా ఉన్నా వదులుకోనని మరి చెబుతోంది. ఇక హైదరాబాద్ జీవితం చాలా బాగుంటుంది… అందుకే ఈ నగరం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఆహారం బాగుంటుంద‌ని ఇక్క‌డ బిర్యానీతో పాటు టమాటా ప‌ప్పు అదుర్స్ అంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news