టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రిందట నాగార్జున సినిమా వస్తుందంటే చాలు అమ్మాయిలు వేలం వెర్రిగా థియేటర్లకు క్యూ కట్టేవారు. అప్పట్లో నాగార్జునకు మహిళా అభిమానులు విపరీతంగా ఉండేవారు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు కూడా మహిళ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అదే వరసత్వాన్ని నాగార్జున కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు.
అయితే నాగార్జున అమ్మాయిల విషయంలో మంచి ప్లే బాయ్ అని.. అమ్మాయిలను చాలా సింపుల్ గా ఆకర్షించేస్తారు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉండనే ఉంది. ముందుగా రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున ఆమెకు విడాకులు ఇచ్చేసి.. హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నారు. అమలను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ టబుతోను ఎఫైర్ నడిపాడు అన్న సంగతి తెలిసిందే.
ఆ మాటకు వస్తే టబూ మాత్రమే కాదు నాగార్జున లిస్టులో సౌందర్య – ఊర్మిళ – అనుష్క ఇలా చాలా పేర్లే వినిపిస్తూ ఉంటాయి. నాగార్జున అమ్మాయిలను ఇంత సింపుల్గా ఎలా ? పడగొడతాడు ఆ టెక్నిక్ ఏంటి ?అన్నదానిపై ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు హైదరాబాద్ వచ్చినప్పుడు నాగార్జున తన గెస్ట్ హౌస్ లలో వాళ్లకు సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసే వారట.
అక్కడ ఇద్దరు ముగ్గురు పనిమనుష్యులతో పాటు రెండు మూడు కార్లు ఏర్పాటు చేసి.. వాళ్ళు హైదరాబాదులో ఉన్నన్ని రోజులు సకల రాజ మర్యాదలు చేసి పంపేవారట. అందుకే ఏ హీరోయిన్ అయినా హైదరాబాద్‌కు వస్తే ముందుగా నాగార్జునకు ఫోన్ చేయడం.. ఆయన మర్యాదలు రుచి చూడడం.. సిటీలో ఎంజాయ్ చేయడం మామూలైంది.
ఇక్కడ వాళ్ల షాపింగ్ కూడా నాగార్జునే ఏర్పాటు చేసేవాడట. ఇలా నాగార్జున చూపించే ఆ ప్రత్యేకమైన అభిమానానికి బాలీవుడ్ హీరోయిన్లతో.. పాటు సౌత్ ఇండియన్ హీరోయిన్లు కూడా బాగా పడిపోయేవారట టబు అయితే ఇప్పటికీ నాగ్‌ను ఆరాధిస్తూనే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.