Movies"అది పొడవుగా ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటా"..జాన్వీ డేరింగ్ కామెంట్స్ కి మైండ్...

“అది పొడవుగా ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటా”..జాన్వీ డేరింగ్ కామెంట్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డాటర్ జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు అమ్మడు తెలుగులో సైన్ చేసింది ఒక్కటి అంటే ఒక్క సినిమానే. ఇంతవరకు ఆ సినిమా రిలీజ్ ఏ కాలేదు ..ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇంతవరకు అమ్ముడు ఆ సినిమా షెడ్యూల్లో పాల్గొనేలేదు ..అయితే టాలీవుడ్ లో మాత్రం అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

అంతేనా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అమ్మడు హవ్వ మామూలుగా లేదు అంటూ శ్రీదేవి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ రీసెంట్గా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది.

ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లు చెప్పే జాన్వి కపూర్ రీసెంట్గా బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఓపెన్ గా చెప్పేసింది. ” డబ్బు లేకపోయినా పర్వాలేదు ..అందంగా లేకపోయినా కూడా పర్వాలేదు.. కానీ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి “అంటూ కండిషన్ పెట్టింది. అంతేకాదు హైట్ విషయంలో వాళ్ళ నాన్న కన్నా పొడవుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని కరాకండిగా చెప్పేసింది . ఈ క్రమంలోనే బోనీకపూర్ కన్నా హైట్ ఉండే అల్లుడిని ఇప్పుడు బోనికపూర్ వెతకాల అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తుంటే ..మీ హైట్ కి అంత హైట్ వాడు మ్యాచ్ అవుతాడా ..? అంటూ పలువురు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు తన కాబోయే భర్త విషయంలో ఫుల్ పక్కాగా ఉంది జాన్వీ అని అర్థం అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news