నటసింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహరెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ బాలయ్యకు జోడీగా హానీరోజ్ నటించింది. థమన్ స్వరాలు అందించగా పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
అఖండ తర్వాత బాలయ్య, క్రాక్ తర్వాత గోపీచంద్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కట్ చేస్తే సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ రు. 140 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. తాజాగా ఈ నెల 21వ తేదీతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది.
ఈ సినిమా మొత్తం 4 కేంద్రాల్లో సెంచరీ కొట్టింది. బాలయ్య సొంత నియోజకవర్గం హిందూపుర్‌తో పాటు కర్నూలు జిల్లా ఆలూరు, బాలయ్య సినిమాలకు కంచుకోట అయిన చిలకలూరిపేట, విజయవాడ శకుంతలలో 100 రోజులు ఆడింది. ఇక చిలకలూరిపేటలో బాలయ్య అన్నీ సినిమాలు సెంచరీలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి వీరసింహారెడ్డి సెంచరీ కొట్టింది. అక్కడ అదే రామకృష్ణ థియేటర్లో అఖండ 175 రోజులు ఆడడం విశేషం.
వీరసింహారెడ్డి సెంచరీ కేంద్రాలు ఇవే…
ఈ నెల 21వ తేదీకి 4 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోనుంది.
1- హిందూపురం – గరునాథ్ థియేటర్
2- ఆలూరు – లక్ష్మీ నరసింహా
ఈ రెండు థియేటర్లలోనూ సీనియర్ హీరోల్లో ఫస్ట్ 100 రోజులు ఆడిన సినిమా బాలయ్య వీరసింహారెడ్డి కావడం విశేషం.
3- చిలకలూరిపేట – రామకృష్ణ
4- విజయవాడ – శకుంతల