సినీ ఫీల్డ్‌లో ఉన్నవారిలో చాలా మంది పన్నులు సక్రమంగా చెల్లించేవారు కాదనే భావన ఉంది. దీంతో ఐటీ శాఖ వారు ఎప్పటికప్పుడు.. హీరోలు.. హీరోయిన్ల ఆదాయ వ్యయాలపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టేవారు. వారి వ్యవహారాలను గమనిస్తూ.. దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలా చేసుకునే సావిత్రి సగం సంపదను సీజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఆమె పెద్దగా చదువుకోకపోవడంతోనే ఇలా జరిగింది.
అయితే.. భానుమతి సహా మరికొందరు మాత్రం ఎప్పటి కప్పుడు పన్నుల విషయంలో జాగ్రత్తలు పడేవా రు. వారి స్టూడియో ఖర్చులు.. మేనేజర్ల జీతాలను ఠంచనుగా చూపించేవారు. ఇలా.. అక్కినేని నాగేశ్వర రావు కూడా.. ఐటీ విషయంలో పక్కా లెక్కలతో ఉండేవారు. గతంలో పద్మనాభం ఇంటిపైవరుసగా ఏడు రోజుల పాటు ఐటీ దాడులు జరిగి..తమిళనాడులో సినీతారలు హడలిపోయారు.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకు ఎప్పుడూ రాని అక్కినేని తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పుకొన్నారు. తాను ఐటీ సక్రమంగా ఫైల్ చేస్తున్నానని.. ఇంకేదైనా రాసుకోవచ్చు కానీ.. ఇలా ఆర్థిక వ్యవహారాల్లో తలపెట్టి లేనిపోనివి రాయొద్దంటూ.. మీడియాకు చెప్పారు. ఆయనకు ఐటీ శాఖ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని తొలిసారి అప్పుడే ఆయన బయటపెట్టారు.
దీంతో ఆయన పన్ను చెల్లింపు విషయంలో ఇండస్ట్రీలోనే ది బెస్ట్ అనిపించుకున్నారు. ఎన్టీఆర్ కూడా అంతే. ఎక్కడా వీరిపై ఐటీ దాడులు జరగలేదు. ప్రతిరూపాయికీ లెక్కలు చెప్పారు. ట్యాక్సులు కూడా కట్టారు. అదేవిధంగా ప్రభుత్వాల నుంచి రాయితీలు కూడా పొందారు. అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటులో 40 శాతం రాయితీ.. అలా వచ్చిందే కావడం గమనార్హం.