Moviesఅఖిల్ అంటే ఉపాసన కి ఎందుకంత కోపమో తెలుసా..? అంత పెద్ద...

అఖిల్ అంటే ఉపాసన కి ఎందుకంత కోపమో తెలుసా..? అంత పెద్ద తప్పు చేశాడా.?

ఎస్ .. మెగా కోడలు పిల్ల ఉపాసన యంగ్ హీరో అఖిల్ పై గుర్రుగా ఉందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ కోపం ఈనాటిది కాదు.. ఎప్పటిదో .. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ త్వరలోనే ఏజెంట్ అనే సినిమాతో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అఖిల్ తనదైన స్టైల్ లో సినిమాకి ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాకి మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోని అఖిల్ కి సంబంధించిన పాస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే అక్కినేని అఖిల్ – శ్రేయ భూపాల్ ను నిశ్చితార్థం చేసుకున్నారు . ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆమెకు బ్రేకప్ చెప్పేసి .. సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఆ తర్వాత శ్రేయ కొన్నాళ్లపాటు సింగిల్ గా ఉంటూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది . శ్రేయ భూపాల్ ఎవరో కాదు ఉపాసన కజిన్. ఇప్పటికీ ఉపాసన ఏ ఫంక్షన్ లో కనిపించిన ఉపాసన పక్కనే ఉంటూ ఆమెకు సంబంధించిన ప్రతి ఆనందంలోనూ షేర్ చేసుకుంటూ ఉంటుంది .

రీసెంట్గా ఉపవాసన శ్రీమంతం వేడుకల్లో కూడా శ్రేయ ఏ రేంజ్ లో హంగామా చేసిందో మనందరికీ తెలిసిందే . కాగా తన కజిన్ ఇంతలా టార్చర్ చేసినందుకు అఖిల్ అంటే ఉపాసనకు ఇప్పటికి కోపమే అని ..కేవలం అఖిలే కాదు అక్కినేని నాగార్జున – అక్కినేని నాగచైతన్య అన్నా కూడా ఉపాసనకి పడదని ..అందుకే ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . అప్పట్లో అఖిల్ – శ్రేయ బ్రేకప్ విషయంలో అఖిల్ దే తప్పు అన్న వాదన ఎక్కువగా వినిపించింది . అఖిల్ హెడ్ వెయిట్ తోనే ఈ నిశ్చితార్ధాని బ్రేకప్ చేసేసి ఆమె లైఫ్ ని స్పాయిల్ చేశాడు అంటూ కూడా అప్పట్లో జనాలు కామెంట్స్ చేశారు . ఏది ఏమైనా సరే ఆ పాపమే ఇప్పుడు అఖిల్ కి పెళ్లి కాకుండా సింగిల్ గా మిగిలిపోయేలా చేసింది అంటూ కూడా కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news