Moviesఅప్పుడు త్రిష .. ఇప్పుడు అనుష్క.. ప్రభాస్ లవ్ స్టోరీకి విలన్‌గా...

అప్పుడు త్రిష .. ఇప్పుడు అనుష్క.. ప్రభాస్ లవ్ స్టోరీకి విలన్‌గా మారిన‌ స్టార్ హీరో..!

టాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు మోస్ట్ ఎలిజిబుల్ స్టార్ ప్రభాస్. 45 సంవత్సరాల వయసుకు చేరువ అవుతున్న కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి ఏదో ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. అసలు ప్రభాస్ పెళ్లి లేకుండా తెలుగు మీడియా, సోషల్ మీడియాకు రోజు గడవదు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రభాస్ – అనుష్క పెళ్ళంటూ హడావుడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ కి అనుష్క, కృతి సనన్‌, త్రిష వంటి హీరోయిన్లతో ప్రేమాయణం ఉందని అయితే మీరు కొన్ని కారణాల వల్ల విడిపోయారంటూ వార్తలు వినిపించాయి.

ప్రభాస్, అనుష్క ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరికీ పెళ్లి కాలేదు. త్వరలోనే వీరిద్దరూ దంపతులు కాబోతున్నారంటూ టాలీవుడ్ లోనే చాలామంది చెబుతూ ఉంటారు. ఇక ఆదిపురుష్‌ సినిమా సమయంలో ప్రభాస్ – కృతిసనన్‌ ప్రేమాయణం బాగా వైరల్ అయింది. అయితే ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్న కొత్తలో చెన్నై బ్యూటీ త్రిష‌తో ప్రేమలో పడ్డాడట.

ఆ కారణంతోనే ప్రభాస్ – త్రిష కాంబినేషన్లో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు ఇలా మూడు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ వరుసగా రిపీట్ అవడంతో వీరిద్దరి ప్రేమ మరింత బలపడిందని వార్త‌లు వచ్చాయి. అదే టైంలో కోలీవుడ్లో స్టార్ హీరో విజయ్ కి త్రిష‌కు మధ్య కూడా ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. అప్పటికే విజయ్ కి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడంతో త్రిష అతడికి దూరమైందని అంటారు.

ఇటు ప్రభాస్ కూడా త్రిష‌ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడని.. అందుకే ఆమెకు వరుసగా మూడు సినిమాలలో ఛాన్సులు ఇచ్చాడని.. అదే సమయంలో అటు విజయ్‌తో ప్రేమలో ఉందన్న విషయం తెలిసి.. ఆమె క్యారెక్టర్ నచ్చకే ఆమెకు బ్రేకప్ చెప్పేసాడు అని కూడా గుసగుసలు వినిపించాయి. ఈ మూడు సినిమాల తర్వాత కూడా మరోసారి ప్రభాస్ – త్రిష కాంబినేషన్ రిపీట్ చేయాలని ఓ స్టార్ దర్శకుడు అనుకున్నాడట.

అయితే ప్రభాస్ తన సినిమాలో త్రిష‌ను వద్దని చెప్పడంతో ఆమెను పక్కనపెట్టి మరో హీరోయిన్ తో ఆ సినిమా షూటింగ్ చేశారు. వీరిద్దరూ బ్రేకప్ జరిగి ఇన్ని రోజులైనా మళ్ళీ ఇప్పటికీ వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అలా ప్రభాస్ కు త్రిషపై ఆ స్థాయిలో కోపం ఉందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటు ఉంటారు అసలు నిజానిజాలు ఏంటో ప్రభాస్, త్రిష‌కే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news