Moviesసూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు విజ‌య‌నిర్మ‌ల‌తో పెళ్ల‌య్యాక కూడా ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్...

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు విజ‌య‌నిర్మ‌ల‌తో పెళ్ల‌య్యాక కూడా ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ 5 దశాబ్దాల సినిమా కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు ఉర్రూత‌లూగి పోయేవారు. పౌరాణికం – సాంఘికం – జానపదం – కౌబాయ్ ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగిపోవటం కృష్ణ గారికి మాత్రమే సాధ్యమయ్యేది. ఇక ఆయన నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ లో ఈ తరం సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు.

విచిత్రం ఏంటంటే అప్పట్లో కృష్ణకు.. ఇప్పుడు మహేష్ బాబుకు మహిళ అభిమానులు ఎక్కువగా ఉండేవారు. ఇక కృష్ణ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తన మేనమామ కుమార్తె ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. అలాగే తాను సినిమాలలో నటిస్తున్న క్రమంలో విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకొని ఆమెను రెండో భార్యగా స్వీకరించారు. అప్ప‌టికే విజ‌య‌నిర్మ‌ల‌కు మ‌రొ వ్య‌క్తితో పెళ్ల‌య్యి న‌రేష్ జ‌న్మించ‌డం.. విడాకులు తీసుకోవ‌డం జ‌రిగాయి.

విజయనిర్మలతో పెళ్లి అయ్యాక కూడా కృష్ణకు మరోసారిమరో స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ ఉందన్న గుసగుసలు అప్పట్లో తెలుగు సినిమా సర్కిల్స్ లో బాగా వినిపించేవి. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. విజయనిర్మలతో 42 సినిమాలలో జంటగా నటించిన కృష్ణ.. ఆ తర్వాత జయప్రదతో ఏకంగా 40కుపైగా సినిమాలలో నటించారు. కృష్ణ – జయప్రద కలిసి కొన్ని నెలలు.. సంవత్సరాలు పాటు షూటింగ్లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందంటారు.

అటు జయప్రద కృష్ణను విడిచి ఉండలేకపోయేదని.. ఇటు కృష్ణ కూడా ఆమెపై అంతేలా మనసు పడేసుకున్నారు అన్న ప్రచారం జరిగింది. అయితే జయప్రద.. కృష్ణతో సన్నిహితంగా ఉన్న విషయం తెలుసుకున్న విజయనిర్మల జయప్రదపై అగ్గిమీద గుగ్గిలం అయ్యేద‌ని గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. అయితే నిజంగా వీరిద్దరూ ఎంత స్నేహంగా ఉన్నా ఎప్పుడు పరిధి దాటి ప్రవర్తించలేదని కృష్ణ – జయప్రద సన్నిహితులు చెప్పేవారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news