యాంకర్ భీమినేని విష్ణుప్రియ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఓ టీవీ షో తో బాగా పాపులర్ అయింది. ముందు జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చాటింది. తర్వాత సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసింది. 2016 లో వచ్చిన ట్విటీఫస్ట్ సెంచరీ లవ్ సినిమాతో పాటు 2020లో వచ్చిన చెక్‌మేట్ అనే సినిమాలోని హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బోల్డ్ యాంకర్ గాను అటు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ అదరగొడుతోంది.
రీసెంట్గా గంగులు అనే వీడియో సాంగ్ చేసి డ్యాన్స్ కుర్ర కారును ఉర్రూతలూగించేసింది. గతంలో వీరిద్దరూ కలిసి జెరీ జెరీ పంచె కట్టి అనే సాంగ్ కూడా చేశారు. ప్రారంభంలో విష్ణుప్రియ చాలా పద్ధతిగా ఉండేది. తర్వాత అటు ఫాలోవర్స్ కోసం.. ఇటు ఛాన్సుల కోసం గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. చివరకు చాలా బోల్డుగా కనిపిస్తోంది.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది. పైకి బోల్డ్ గా కనిపించే విష్ణుప్రియ చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందట. తాజాగా మై విలేజ్ షో వారితో కలిసి ధావత్ చేసుకున్న విష్ణుప్రియ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో పడిన కష్టాలను వివరించింది. విష్ణుప్రియ అమ్మానాన్నలది చీరాల, బాపట్ల. ఆమె పుట్టింది పెరిగింది అంతా చెన్నై. విష్ణు ప్రియ తల్లి హెయిర్ డ్రస్సర్.
ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శ్రీయ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రెస్సర్‌గా పని చేసింది. మా అమ్మ టాలెంట్ ఉన్న ఇలా ఎందుకు ఉండిపోయిందని బాధ తనకు ఉండేదని.. ఆమె కోసమే కష్టపడి తాను ఇక్కడ వరకు వచ్చానని విష్ణు ప్రియ తెలిపింది. 2015 ఇండస్ట్రీలోకి వచ్చానని.. పోవే పోరా షోతో తనకు బ్రేక్ వచ్చిందని.. ఆ తర్వాత నెంబర్ వన్ యారి – పోవే పోరా షోలకు ఒకేసారి ఆఫర్లు వచ్చాయని.. ఇప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకుని సెటిల్ అయ్యానంటూ విష్ణుప్రియ పడిన కష్టాలను వివరించింది.