దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి అంటే అప్పట్లో ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ఒక పిచ్చి. శ్రీదేవి అపురూప అందాల రాశి. ఆమెను వెండితెర మీద చూసేందుకు 60 ఏళ్ల ముసలోళ్ళు సైతం లొట్టలేసుకుని మరి థియేటర్లకు వెళ్లేవారు అంటే శ్రీదేవి తన అందచందాలతో ఎంతలా కవ్వించేదో అర్థమవుతుంది. అంత గొప్ప అందం ఆమెది. అసలు శ్రీదేవి ఓకే చెప్పాలే కానీ.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎంతోమంది సుందరాంగులు క్యూలో ఉండేవారు.
అసలు విదేశాలకు చెందిన ఎంతోమంది అబ్బాయిలు సైతం శ్రీదేవిని ఫొటోలలో చూసి మోహించి చెన్నై వచ్చి ఆమెను చూసి వెళ్లేవారు. అంటే ఆమెది ఎంత గొప్ప అందమో అర్థం చేసుకోవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్ శ్రీదేవిని ప్రేమించారు. అయితే కొన్ని కారణాలవల్ల వారిద్దరు ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూడా శ్రీదేవికి భర్త కావలసిన వ్యక్తి.
ఇలా ఎంతోమంది తన వెంటపడ్డా.. వారందరినీ కాదనుకొని ఆమె తనకంటే వయసులో చాలా పెద్దోడు, ముసలోడు, పైగా అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నవాడు అని తెలిసి కూడా బోనీ కపూర్ జీవితంలోకి రెండో భారీగా వెళ్ళింది. అంతకుముందు కూడా బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో శ్రీదేవి సహజీవనం చేసింది. అయితే మిథున్ చక్రవర్తి తన భార్య యోగితా బాలీకి విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనే శ్రీదేవి అతడికి దూరమైంది.
అయితే శ్రీదేవిని కుటుంబ సభ్యులు, తన బంధువులు నమ్మించి మోసం చేశారు. అలా శ్రీదేవి తన సంపాదించిన ఆస్తులలో చాలా కోల్పోయింది. అప్పటికే శ్రీదేవి తల్లి కూడా మృతి చెందింది. ఇలా తనకు ఎవరు లేరని… తన బంధువులు మోసం చేస్తున్నారన్న ఆవేదనతో.. వెంటనే తనకు ఒక తోడు ఉండాలని అనుకుని బోనికపూర్ మాయలో పడిపోయింది. శ్రీదేవి తనకంటూ ఒక తోడు ఉండాలని ఆలోచన చేసినప్పుడు.. తన ఈడు జోడు, తన అందానికి తగిన భర్తను ఎన్నుకుని ఉంటే ఆమె జీవితం కచ్చితంగా ఇలా అయ్యి ఉండేదే కాదు.
తనను తన బంధువుల నుంచి రక్షించుకునేందుకు ఎవరో ఒకరు తోడు ఉంటే చాలని అనుకుందే తప్ప… తన స్థాయికి తగిన భర్తను ఎంపిక చేసుకోవడంలో మాత్రం ఆమె ఘోరంగా విఫలమైంది. ఇది ఆమె జీవితంలో ఎప్పటకీ వెనక్కు తీసుకోలేని పొరపాటుగా మిగిలిపోయింది.