Moviesకడుపుతో ఉన్న భార్య కోసం చరణ్ ఏం చేసాడొ తెలుసా..? చో...

కడుపుతో ఉన్న భార్య కోసం చరణ్ ఏం చేసాడొ తెలుసా..? చో చ్వీట్ హబ్బీ..చూసి నేర్చుకోండ్రా అబ్బాయిలు..!!

మనకు తెలిసిందే మెగా కోడలు పిల్ల ఉపాసన కడుపుతో ఉంది . ప్రెసెంట్ ఆరవ నెల రన్ అవుతుంది . మరికొన్ని నెలల్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది . పుట్టేది పాపనా లేక బాబునా అనేది పక్కన పెడితే ..ఉపాసనని మాత్రం మెగా ఫ్యామిలీ దేవతల ట్రీట్ చేస్తుంది . కేవలం మెగా ఫ్యామిలీ కాదు ..మెగా అభిమానులు.. ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా ఉపాసన ని దేవతల ట్రీట్ చేస్తున్నారు.

ఇన్నాళ్లకు కడుపు పండిందని మెగా వారసుడు రాబోతున్నాడు అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే కడుపుతో ఉన్న భార్య కోసం చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . కడుపుతో ఉన్న భార్యను కేర్ఫుల్ గా చూసుకోవడానికి ప్యాటర్నిటి లీవ్ తీసుకోబోతున్నాడట. బడా సంస్థల్లో ఉండే ఉద్యోగులు ఇలా భార్యా కడుపుతో ఉన్నప్పుడు ప్యాటర్నిటి లీవ్ అనేది తీసుకుంటూ ఉంటారు . చరణ్ కూడా ఆ కేటగిరీలోకి వచ్చేసాడు.

భార్య కోసం ఏకంగా మూడు నెలలు లీవ్ ని తీసుకొని జూలై, ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో అస్సలు ఏ షూటింగ్స్ పనులు పెట్టుకోకుండా… ఎటువంటి బిజీ షెడ్యూల్స్ లేకుండా తన టైం మొత్తం భార్యకే కేటాయించడానికి ఫిక్స్ అయ్యాడట . ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇలా ఏ మెగా హీరో చేయలేదని.. ఫస్ట్ టైం భార్య కోసం చరణ్ నే చేస్తున్నాడు అని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . అంతేకాదు అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతున్నారు . సో స్వీట్ హస్బెండ్.. అబ్బాయిలు చూసి నేర్చుకోండి ..చరణ్ లా గా మీరు మీ భార్యలను సంతోషంగా చూసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news