Moviesరు. 1000 కోట్ల హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌… టాలీవుడ్ స్టార్ల‌కు చెమ‌ట‌లు...

రు. 1000 కోట్ల హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌… టాలీవుడ్ స్టార్ల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయ్‌…!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ హీరోగా మారిపోయారు. ఈ దెబ్బతో ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ కూడా వేరే లెవల్ కు వెళ్ళిపోయింది. త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రు. 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా విజయంలో మరో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు భాగం ఉంది. అలాగే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి కూడా..!

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్టులు చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలకే మైండ్ పోయేలా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపి.. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనుంది.

ఈ రెండు సినిమాలు ఎప్పటినుంచో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక తాజగా ఎన్టీఆర్ 32వ సినిమా కూడా 32వ సినిమాపై కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించబోతున్నాడ‌న్న‌ వార్త బయటకి వచ్చింది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోష‌న్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ఈ సినిమాకు బ్ర‌హ్మాస్ట్ర డైరెక్ట‌ర్ ఆయుష్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ రు. 75 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నాడు. ఈ మూడు సినిమాల‌తో ఎన్టీఆర్ సినిమాల మార్కెట్ రు. 1000 కోట్లు దాటేసిన‌ట్ల‌య్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ స్ట్రాంగ్ లైన‌ప్ చూసి టాలీవుడ్ స్టార్ హీరోల‌కు సైతం మ‌తులు పోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news